ఫిట్‌నెస్‌కు కదలని బస్సులు
నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థుల నమోదు శాతం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
- నిర్మల్ జిల్లాలో 317 బడి బస్సులు
- ఇప్పటివరకు ఫిట్నెస్ చేసుకున్నవి 73..
- ఫిట్నెస్ లేకుండా రోడ్డెక్కితే కేసులు చేస్తాం : ఎంవీఐ
- నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
నిర్మల్ అర్బన్, జూన్ 11 : నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థుల నమోదు శాతం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పదిహేనేండ్లకు పైబడి కాలం చెల్లిన వాహనాలను ఇతర రాష్ర్టాల నుంచి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, పైపైన రంగులు అద్దుతూ రోడ్లపై తిప్పుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలకు తావిస్తున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 317 ప్రైవేటు పాఠశాలల బస్సులు ఉండగా ఇప్పటివరకు కేవలం 73 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. వీటిలో గతేడాది కొత్తగా బస్సులను కొనుగోలు చేయగా.. రెండేండ్ల వరకు ఎలాంటి ఫిట్నెస్ అవసరం లేదు. ఇంకా 242 ప్రైవేటు బస్సులు ఫిట్నెస్ పరీక్షకు రావాల్సి ఉంది.
నిబంధనలు ఇవే..
- పాఠశాల పేరును బస్సుపై కనిపించే విధంగా రాయించాలి.
- బస్సులో ఫస్ట్ ఏయిడ్ బాక్సు, మందులు, కిట్లు అందుబాటులో ఉంచాలి.
- బస్సుల కిటికీల వద్ద చేతులు, తలలు బయట పెట్టకుండా గ్రిల్స్ ఏర్పాటు చేయించాలి.
- బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే మంటలను ఆర్పేందుకు పరికరాలను అందుబాటులో ఉంచాలి.
- ప్రమాదాలు జరిగినపుడు వెంటనే బయటకు తీసేందుకు ఎమర్జెన్సీ తలుపు ఉండాలి.
- పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో ఎక్కించుకోవద్దు. బస్సులో విద్యార్థుల వివరాలు, అడ్రస్ ఉంచాలి. l ఫుట్‌బోర్డు, హైండ్ బ్రేక్ అందుబాటులో ఉండాలి.
- బ్యాగులు పెట్టుకునేందుకు ర్యాక్‌లు అందుబాటులో ఉంచాలి.
- 50 ఏండ్లు పైబడిన వారిని తీసుకోకూడదు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
- వాహనాలు నడిపే డ్రైవర్ కంటి పరీక్ష చేసుకోవాలి.
- బస్సులు కండీషన్లో ఉండి.. రూప్‌టాప్, నాణ్యమైన సీట్లు అందుబాటులో ఉండాలి.
- వీటితోపాటు ట్యాక్సులు చెల్లించి, పర్మిట్ కలిగి ఉండాలి. వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్సు, డ్రైవింగ్ లైసెన్సు, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలి.
కేసులు నమోదు చేస్తాం..
పాఠశాల ప్రారంభం లోపు అన్ని ప్రైవేటు పాఠశాలల బస్సులు ఫిట్నెస్ చేసుకోవాలి. లేకుం డా రహదారులపై నడిపితే ఎంవీ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేస్తాం. పాఠశాలలు ప్రారంభానికి ముందే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలి.
– మహేందర్, ఎంవీఐ, నిర్మల్ జిల్లా.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrayaan | మందమర్రి టు చందమామ.. నవంబర్ 13న థియేటర్లలోకి ‘చంద్రయాన్’ నవ్వుల రాకెట్!
బడిలో మద్యం సేవిస్తూ పట్టుబడ్డ హెడ్మాస్టర్ : వీడియో
Stock Market | నేడూ కొనసాగిన బుల్ జోష్.. సెన్సెక్స్ వరుసగా రెండోరోజూ 1200 పాయింట్లు జంప్..!
గ్రామాల్లో పారిశుధ్య పనులపై డీపీఓ అనూష ఆకస్మిక తనిఖీలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

