
నిర్మల్ అర్బన్, జనవరి 28:దహన సంస్కారాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని శివాజీచౌక్ ప్రాంతంలో రూ. 2.75 కోట్లతో చేపడుతున్న వైకుంఠధామం పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. ప నుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే ఆధునిక హంగులతో నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. తాగునీటి సౌకర్యం, స్నానపు గదు లు, బర్నింగ్ ఫ్లాట్పాం, ఆర్చ్ పనులను సుందరంగా చేపడుతున్నామన్నారు. పట్టణంలోని 14 వార్డులకు సంబంధించిన ప్రజలు దహనసంస్కారాల కోసం ఈ వైకుంఠధామానికి వస్తున్నారని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పనులు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ.సత్యనారాయణగౌడ్, కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, గండ్రత్ రమణ, ఎస్పీ రాజు, నాయకులు సురేందర్‌రెడ్డి, నర్సాగౌడ్, అడ్ప పోశెట్టి, ఆకుల రామకృష్ణ, కొండ శ్రీధర్, సోన్ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
విద్యాసాగర్ మరణం తీరని లోటు..
నిర్మల్ అర్బన్, జనవరి 28 : హైకోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి విద్యాసాగర్ రెడ్డి మరణం తీరని లోటని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రియదర్శినినగర్-సాగర్ కాలనీలోని తన నివాసంలో విద్యాసాగర్ రెడ్డి పార్ధివ దేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధ్దాంజలి ఘటించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, పూదరి నరహరి తదితరులు ఉన్నారు.
సంతాప సభ..
నిర్మల్ టౌన్, జనవరి 28: పట్టణంలోని నిర్మల్క్లబ్లో విద్యాసాగర్‌రెడ్డి సంతాపసభను నిర్వహించగా.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాసాగర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాయవాదిగా, విద్యావేత్తగా ప్రజలకు ఆయన చేసిన సేవలను ప్రజలు మరచిపోరని పేర్కొన్నారు. అంతకుముందు దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్‌లో విద్యాసాగర్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆయన వెంట నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
గాజులపేట్‌లో మొక్కలు నాటిన మంత్రి…
పట్టణంలోని గాజులపేట్ కాలనీలో హరితహారంలో భాగంగా శ్రీ సంకల్ప హోం డెవలపర్స్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వైస్ చైర్మన్ సాజిద్, తదితరులు ఉన్నారు.