డీఎల్పీవో ప్రభాకర్
పాఠశాలల్లో పారిశుధ్య పనుల పరిశీలన
కోటపల్లి, ఆగస్టు 25 : సెప్టెంబర్ ఒకటి నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులు, హెచ్ఎంలను డీఎల్పీవో ప్రభాకర్ ఆదేశించారు. కోటపల్లి ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన పారిశుధ్య పనులను డీఎల్పీవో ప్రభాకర్ గురువారం పరిశీలించారు. తరగతి గదులను శుభ్రం చేయడంతో పాటు పాఠశాల ఆవరణ, పరిసరాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. తప్పనిసరిగా పాఠశాలలో సోడియం హైపో క్లోరైడ్, దోమల నివారణ ద్రావణం పిచికారీ చేయాలన్నారు. పాఠశాలలో ఆహ్లాద వాతావరణం ఏర్పడేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో ముల్కల్ల సత్యనారాయణరెడ్డి, పాఠశాల హెచ్ఎంలు బాణాల లక్ష్మీనారాయణ, అంజన్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి రవళి పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో..
మంచిర్యాలటౌన్, ఆగస్టు 26: ప్రభుత్వ పాఠశాలల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణ పరిశీలించారు. మంచిర్యాల పట్టణంలోని రాజీవ్‌నగర్‌లో ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాల, మోడల్ పాఠశాలలో గురువారం పారిశుధ్య పనులు చేపట్టారు. తరగతి గదులతో పాటు పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కొవిడ్ నివారణ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలల ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, ఈగలు, దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బుద్ధార్థి రాంచందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ రాథోడ్, పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.
తాండూర్ మండలంలో..
తాండూర్, ఆగస్టు 26 : మండలంలోని తాండూర్ జడ్పీహెచ్ఎస్, కేజీబీవీ, మాదారం, మాదారం త్రీ ఇైంక్లెన్, మాదారం-2, ఎంవీకే-5, నర్సాపూర్ ఎంపీయూపీఎస్ పాఠశాలల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో సిబ్బంది నిర్వహిస్తున్న పారిశుధ్య పనులను ఎంపీడీవో వేణుగోపాల్, మండల విద్యాధికారి వాసాల ప్రభాకర్ పరిశీలించారు. మౌలిక వసతులు మరుగుదొడ్లు, తాగు నీటి సదుపాయాన్ని పరిశీలించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు ప్రతి పాఠశాలలో సరఫరా అయ్యే విధంగా చూడాలని హెచ్ఎంలను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సీఆర్పీ తిరుపతి పాల్గొన్నారు.
కాసిపేట మండలంలో..
కాసిపేట, ఆగస్టు 26 : మండలంలోని పెద్దనపల్లి, సోమగూడెం(కె), కాసిపేట, ముత్యంపల్లి పాఠశాలల్లో పారిశుధ్య పనులను ఎంపీడీవో ఎంఏ అలీం, ఎంఈవో దామోదర్‌రావు పరిశీలించారు. పాఠశాలల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని, తరగతి గదులను శానిటైజేషన్ చేయించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
వేమనపల్లి మండలంలో..
వేమనపల్లి, ఆగస్టు 26 : వేమనపల్లి మండలంలోని కేతనపల్లి గ్రామంలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్య పనులను ఎంపీవో అనిల్‌కుమార్ పరిశీలించారు. ఆయన వెంట హెచ్ఎం సాంబశివరావు, సిబ్బంది ఉన్నారు.
నస్పూర్ మున్సిపాలిటీలో..
శ్రీరాంపూర్, ఆగస్టు 26: నస్పూర్ మున్సిపాలిటీలోని 3, 4 వార్డుల్లో ప్రైమరీ పాఠశాలల తరగతి గదులను శుభ్రం చేయిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. తాగు నీటితో పాటు తదితర వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. తరగతి గదులను శానిటైజ్ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజలింగు, కౌన్సిలర్లు పంబాల గంగా ఎర్రయ్య, బెడిక లక్ష్మి, కో ఆప్షన్ సభ్యుడు నాసర్, ఆర్ఐ వెంకటేశ్ పాల్గొన్నారు.
పాఠశాలల్లో పారిశుధ్య పనులు
దండేపల్లి, ఆగస్టు 26: మండలంలోని రెబ్బెన్‌పెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు, ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ కందుల కల్యాణి-అశోక్, జీపీ కార్యదర్శి శ్రావణ్‌కుమార్ శానిటేషన్ పనులను పర్యవేక్షించారు.
విద్యార్థులకు తాగునీరు అందించేందుకు కృషి
కాసిపేట, ఆగస్టు 26 : విద్యార్థులకు తాగు నీరు అందించే విధంగా కృషి చేస్తామని బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డులోని కాసిపేట మండలం స్టేషన్ పెద్దనపల్లి ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య, శానిటైజేషన్ పనులను ఆమెపర్యవేక్షించారు. తాగునీటి సమస్యపై కౌన్సిలర్ కొక్కెర చంద్రశేఖర్ కోరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొక్కెల చంద్రశేఖర్, యూత్ అధ్యక్షుడు సిరవేణి రాజ్‌కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జక్కుల శ్రీధర్, సుక్క మల్లేశ్, మహిళా నాయకురాళ్లు మల్లక్క, వరక్క, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.