రామకృష్ణాపూర్, జనవరి 27 : క్యాతనపల్లి మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలకు చెందిన 1997-1998 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు శనివారం ఒకే వేదికపై కలుసుకున్నారు.
శ్రీనివాస గార్డెన్లో అపూర్వ సమ్మేళనంలో నిర్వహించి, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. అనంతరం అందరూ కలిసి భోజనం చేశారు.