కాసిపేట : ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలే ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీటీడీవో రమాదేవి ( DTDO Ramadevi ) సూచించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని దేవాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆశ్రమంలోని స్టోర్ రూం, ఆహార పదార్ధాలను, పరిసరాలను పరిశీలించి, విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యల ఆరా తీశారు. రిజిస్టర్లను తనిఖీ చేశారు. మరుగుదొడ్లు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంటును పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ పదో తరగతి వందశాతం ఫలితాలు సాధించాలని, రోజు వారి టెస్టుల్లో వారి సామార్ధ్యాలను పరిశీలించాలని తెలిపారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో సురేష్, హెచ్ డబ్ల్యూవో సుశీల, ఉపాధ్యాయులు బద్ది శ్రీనివాస్, ఏఎన్ఎం గంగాదేవి పాల్గొన్నారు.