
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2.07 లక్షల సభ్యత్వాలు
ఈ నెల 12 వరకు గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలి
ఎమ్మెల్సీ వీ గంగాధర్‌గౌడ్
ముథోల్, సెప్టెంబర్ 6 : టీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యం గా కృషి చేస్తున్నట్లు నిజామాబాద్ ఎమ్మెల్సీ, గ్రామ, పట్టణ, మండల కమిటీల ఇన్చార్జి వీ గంగాధర్ గౌడ్ అన్నారు. ముథోల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు 11 మంది సభ్యులతో కలిసి గ్రామ, అనుబంధ కమిటీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.12 నుంచి 20వ తేదీ వరకు మండల కమిటీలు, తదనంతరం జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్యులున్నట్లు గుర్తు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతం లో 1.80 లక్షల సభ్యత్వాలుండగా.. ఈ సంవత్సరం 2.07 లక్షలు నమోదైనట్లు వివరించారు. ముథోల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 50 నుంచి 60 శాతం సభ్యత్వాలు నమోదు చేసినట్లు వివరించారు. తానూర్, కుభీర్ మండలాల్లో కమిటీల ఏర్పాటు పూర్తయిందని వెల్లడించారు. ప్రజ లు టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడూ అండగా ఉంటారన్నారు. త్వరలోనే ముథోల్ నియోజకవర్గంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ భవనాలను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. ఏడు లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 12 వరకు కమిటీలను పూర్తి చేయాలని కార్యకర్తలకు సూచించారు. వీటిని రాష్ట్ర కమిటీలకు అప్పగిస్తామన్నారు. సమావేశంలో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్, జడ్పీ వైస్ చైర్మన్ సాగరాబాయి రాజన్న, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, నాయకులు మగ్దూమ్, నూకం రామారావు, పోతన్న యాదవ్, మల్కన్న, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీకి సన్మానం
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 6: టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ వీ గంగాధర్ గౌడ్‌ను సోమవారం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సన్మానించారు. ఎమ్మెల్యే ఇంట్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి సమక్షంలో ఆయనను శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడు తూ.. నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకుంటున్నారన్నారు. జోగు రామన్న నాయకత్వంలో నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.