
నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే
బృహత్ పల్లె ప్రకృతివనం పనుల పరిశీలన
లోకేశ్వరం, సెప్టెంబర్ 6 : పర్యావరణ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నదని నిర్మ ల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. లోకేశ్వరం మండలం గొడిసెరా గ్రామంలో పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనంలో జరుగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలు నాట డం, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వంటి పనులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. బృహ త్ పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా పాటుపడాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనంలో జరుగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట లోకేశ్వరం ఎంపీడీవో గంగాధర్, సర్పంచ్ కారగిరి భోజవ్వ, నాయకులు కారగిరి గంగాధర్, ఎంపీటీసీ దత్తు, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, ఎంపీవో రమేశ్, ఏపీవో నవీన్, పంచాయతీ కార్యదర్శి గంగాధర్, టెక్నికల్ అసిస్టెంట్లు శారద, హరిత, మంజుల, ఉప సర్పంచ్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 6 : పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దీంతో ఎలాంటి ప్రా ణాంతకమైన వ్యాధులు దరిచేరవని నిర్మల్ అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సోమవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. కాలనీలో తి రుగుతూ పరిసరాలను పరిశీలించారు. ఇంటి పరిసరాల చుట్టూ ఎల్లప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనారోగ్యానికి గురైతే నిర్లక్ష్యం చేయకుండా దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, వార్డు కౌన్సిలర్ సంపంగి రవీందర్, తదితరులున్నారు.