
బేల, సెప్టెంబర్ 6 : పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే అన్నారు. మండలంలోని సైద్పూర్, సాంగ్వి, దౌన , తోయగూడలో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గంభీర్ ఠాక్రే మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను గ్రామాల్లోకి తీసుకెళ్లాలన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించేలా చూడాలన్నారు. కార్యక్రమాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్ , సైద్పూర్ సర్పంచ్ సుమన్బాయి, నాయకులు రాజు రోహిదాస్, మెంతం దత్తు పాల్గొన్నారు.
గ్రామ కమిటీల నియామకం
ఇచ్చోడ, సెప్టెంబర్ 6 : టీఆర్ఎస్ గ్రామ కమిటీలను మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి సోమవారం ప్రకటించారు. మండలంలోని ముక్రా (కే), దేవుల్నాయక్ తండా, ముక్రా (బీ)లోటీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. ముక్రా (కే) అధ్యక్షుడిగా తల్వారే తిరుపతి, దేవుల్నాయక్ తండా అధ్యక్షుడిగా జాదవ్ కృష్ణ, ముక్రా (బీ) అధ్యక్షుడిగా అడవ్ ప్రహ్లాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, సర్పంచ్ అడవ్ మారుతి, రాథోడ్ భీంబాయి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఇచ్చోడ డివిజన్ ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, పీఏసీఎస్ డైరెక్టర్ కరే సురేశ్, నాయకులు ముస్తాఫా, వెంకటేశ్, రాథోడ్ ప్రవీణ్, కరే సంజీవ్, శివాజీ, గణేశ్ పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయం
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 6: అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలో కొత్తగూడెంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా ఆత్రం దేవ్రావు, ఉపాధ్యక్షుడిగా లావుడ్య పరశురాం, యువజన సంఘం అధ్యక్షుడిగా జాడి లింగన్న, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మడావి కన్నీబాయి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో చేరగా వారికి రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సెడ్మకి సీతారాం, కామెరి పోశన్న, ముజీబ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పరామర్శ
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింగారే భరత్ తల్లి ఇటీవల మృతి చెందగా ఎంపీపీ పంద్ర జైవంత్రావు, ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్ సోమవారం పరామర్శించారు. వారి వెంట నాయకులు కాటం రమేశ్, కేంద్రె రమేశ్ ఉన్నారు.