
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 5: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, భావిభారత పౌరులను తీర్చిదిద్ది, దేశాభివృద్ధిలో కీలకంగా మారారని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్స వం సందర్భంగా జడ్పీ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివారం డా.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపాధ్యాయులే రేపటి తరా న్ని తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు ప్రా రంభమైన నేపథ్యంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ని ర్వహించాలని సూచించారు. ఎమ్మెల్యే జోగు రామన్న మా ట్లాడుతూ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తునట్లు చెప్పారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. అనంతరం 60మంది ఉత్తమ ఉపాధ్యాయులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. డీఈవో రవీందర్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కృష్ణకుమార్, రవీందర్, రవీంద్ర, వెంకటి, సెక్టోరియల్ అధికారులు కంటె నర్సయ్య, కంది శ్రీనివాస్ రెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న అధ్యాపకులు
నిర్మల్ అర్బన్/ ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 5: నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రిన్సిపాల్‌గా, ఖానాపూర్ మండలం మస్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బాలాజీ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఆదివారం వీరు పురస్కారాలు అందుకున్నారు. కాగా, వీరిని జిల్లాకు చెందిన ప్రజాప్రతి నిధులు, ఉపాధ్యాయులు అభినందించారు.