
ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
ముథోల్, సెప్టెంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరంగా నిలుస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అ న్నారు. ఆదివారం ముథోల్‌లోని తహసీల్ కార్యాలయంలో 74 మంది లబ్ధిదా రులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ కరోనా ఆపత్కాలంలోనూ ప్రభుత్వం పథకాలను కొనసాగిస్తున్నదని పేర్కొ న్నారు. అనంతరం ముథోల్ దవాఖాన సమస్యలను పరిష్కరించాలని పలువురు యువకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఇందుకు ఆయన సానుకూ లంగా స్పందించారు. సర్పంచ్ రాజేందర్, ఎంపీటీసీ భూమేశ్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, పోతన్న యాదవ్, ర వీందర్ రెడ్డి, రమేశ్, తదితరులున్నారు.
బాసర, సెప్టెంబరు 5: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అందజేశారు. ఇద్దరికి రూ. 1,34,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, సర్పంచ్‌లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తానూర్, సెప్టెంబర్ 5: బంజారాల ఆరాధ్యగురువు శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడువాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. మండలంలోని హిప్నెల్లి తండాలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. గోధుమనారు బుట్టలను ఎత్తుకొని మహిళలు, యువకులు ఆలయం వద్ద నృతాలు చేయగా, ఎమ్మెల్యే కూడా వారితో కలిసి స్టెప్పులేశారు. ఎమ్మెల్యేను గ్రామస్తులు శాలువా, పూలమాలతో సన్మానించారు. సర్పంచ్ పవార్ తాన్సింగ్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతరెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, తానూర్ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు తాడేవార్ విఠల్, వడ్గావ్ సర్పంచ్ సంతోష్, మాజీ సర్పంచ్‌లు చంద్రకాంత్ యాదవ్, బాబాసాహెబ్, కేమాజీ, లస్మన్న, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడు గోవింద్ పటేల్, జవలా(బి) ఎంపీటీసీ బసవేశ్వర్, టీఆర్ఎస్ నాయకులు పీరాజీ, అఠల్ దేవిదాస్, కైలాస్, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.