
నేడు చిట్యాల్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ
71 కుటుంబాలకు అందించనున్న మంత్రి అల్లోల
ఐకేఆర్ కాలనీగా నామకరణం
ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి లబ్ధిదారుల్లో సంతోషం
సోన్, సెప్టెంబర్ 3 : పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలోని చిట్యాల్‌లో రూ. 40 కోట్లతో నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు రంగం సిద్ధమైంది. 71 మందికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం అందజేయనుండగా, అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, ఏళ్లుగా తమ ఎదురుచూపులు ఫలించే క్షణం రావడంతో, లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
పేదల సొంతింటి కల సాకా రం కానున్నది. చిట్యాల్లోని నిరుపేద లబ్ధిదారులకు శనివారం డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్క ఇంటికి రూ.5.50 లక్షలు ఖర్చు చేశారు. సర్పంచ్ పడకంటి రమేశ్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అధునాతన సదుపాయాలతో ఇండ్ల ని ర్మాణాన్ని పూర్తి చేశారు. గ్రామానికి ఆనుకొని ఉన్న స్థలంలో 71 ఇండ్లను నిర్మించగా.. వీటి తా ళాలను మంత్రి అందించనున్నారు. సర్పంచ్, గ్రామ కమిటీ సభ్యులు అసలైన నిరుపేదలను ఎంపిక చేయడంతో వారంతా ఒక్కరోజు ముందుగానే ఇండ్లలోకి సంతోషంగా వెళ్లేందుకు కావాల్సి న ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇండ్లకు మామిడి తోరణాలు కట్టడం, రంగులు పూయడం, ము గ్గులు వేయడం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నారు.
ఐకే రెడ్డి కాలనీగా నామకరణం..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సహకారంతో గ్రామంలో 71 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి కావడంతో ఈ కాలనీని మోడల్‌గా తీర్చిదిద్దారు. దీనికి ఐకేరెడ్డి డబుల్బెడ్రూం ఇండ్ల కాలనీగా నామకరణం చేశారు. నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామంలో ఒకేసారి 71 మంది లబ్ధిదారులకు ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు కృషి చేసిన రమేశ్‌రెడ్డి సూచన మేరకు ఐకేరెడ్డి కాలనీగా నామకరణం చేస్తూ గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ప్రతి ఇంట్లో గో డలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చిత్ర పటాలను గోడలపై వేసుకున్నారు. ఇంటి ముందు మొక్కలు నాటుతున్నారు. వరుస క్రమంలో మోడల్ పద్ధలో ఈ కాలనీ నిర్మించుకున్నారు.