
పండుగలను శాంతియుతంగా నిర్వహించుకోవాలి
గణేశ్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
భైంసాలో కోఆర్డినేటింగ్ మీటింగ్
భైంసాటౌన్, సెప్టెంబర్ 3 : పండుగల సమ యంలో ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు సహక రించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కోరారు. భైంసా పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవా రం కలెక్టర్ అధ్యక్షతన గణేశ్ నిమజ్జన ఉత్సవ కో ఆర్డినేటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. ప్రతి ఒక్కరూ పండుగలను వారివారి ఆచార, వ్యవహారాలతో నిర్వహించుకోవాలని పే ర్కొన్నారు. రాబోయే గణేశ్ నవరాత్రి ఉత్సవాల విగ్రహాల నిమజ్జనానికి పట్టణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. సౌకర్యవంతంగా నిమజ్జనం జరిగేలా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యం త్రాంగానికి సహకరించాలని కోరారు. మునుపెన్నడూ లేని విధంగా భైంసా పట్టణం అభివృద్ధిలో దూసుకెళ్తూ అందంగా ము స్తాబైందని తెలిపారు. పట్టణ ప్రజలు మంచి మనసుతో ఒకరికొకరు స హకరించుకొని పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో ఆయా శాఖలకు చెందిన అధికారులకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. గణేశ్ నిమజ్జన సమయంలో మండలవ్యాప్తంగా 48 గంటల పాటు మద్యం విక్రయాలు చేపట్టకుండా చూడాలని ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృ తం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పే ర్కొన్నారు. నిమజ్జన సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను, పడవలను సిద్ధంగా ఉంచాలని, వైద్య శాఖ అధికారు లు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపకశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఫైరింజన్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
వీడీసీలకు చట్టబద్ధత లేదు..
గ్రామాల్లో ఏర్పడిన వీడీసీలకు ఎలాంటి చట్టబద్ధత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ద్వారా గ్రామాభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులకు సహకరించాలని సూచించారు. వీడీసీ వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని గ్రామస్తులపై చర్యలు తీసుకోరాదని తెలిపారు. అలాంటి వారిపై ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డీజేలకు అనుమతి లేదు.. : ఇన్చార్జి ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఉత్సవాలకైనా డీజేలకు అనుమతి లేదని ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎవరైనా డీజేలకు అడ్వాన్స్‌ల రూపంలో డబ్బులు చెల్లిస్తే వాపసు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నియమాలను కాదని డీజే పెడితే నిర్వాహకులపై, గణేశ్ మండలి సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. వాహనాన్ని, డీజేను నేర విభాగం కింద సీజ్ చేస్తామని హెచ్చరించారు. డీజేలతో యజమానికి మాత్రమే ఆదాయం లభిస్తుందన్నారు. డప్పు లు, బ్యాండ్ మేళతాళాలతో గణేశ్ నిమజ్జనాలు జ రుపుకుంటే ఎందరికో ఉపాధి దొరుకుతుందన్నా రు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఏఎస్పీ కిరణ్ ఖారే. జడ్పీ సీఈవో సుధీర్‌బాబు, తహసీల్దార్ విశ్వంభర్, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, సీఐలు చంద్రశేఖర్, ప్రవీణ్ కుమార్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇరువర్గాల శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని పర్యటనకు ప్రత్యేక ఏర్పాట్లు
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 3 : భారత మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ ఈ నెల 5న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పా ట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వస్తున్న మాజీ ప్రధానికి ప్రొటోకాల్ నిబంధనలు, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్‌కుమార్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాం బాబుతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో హెలీప్యా డ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ఉదయం 10.30 గంటలకు నిర్మల్ ఎన్టీఆర్ మినీ స్టేడియానికి చేరుకోనున్న మాజీ ప్రధాని దేవగౌడ స్థానికంగా నిర్వహించే వివిధ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. హెలీప్యాడ్, అంబులెన్స్, బారికేడ్స్, ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని సూచించారు. పోలీసు భద్రత చర్యలను ముందస్తుగా చేపట్టాలన్నారు.