
వాస్తాపూర్ జలపాతం చూసేందుకు వచ్చి చిక్కిన పర్యాటకులు
ఇంద్రవెల్లి/భీంపూర్, సెప్టెంబర్ 3 : ఇంద్రవెల్లి, భీంపూర్ మండలాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లోని వాగులు ఉప్పొంగాయి. నర్సాపూర్‌కు చెందిన రాయిసిడం జంగు బైక్‌పై వాగుదాటే క్రమంలో ప్రమాదవశాత్తు వరదలో కొట్టుకు పోగా, స్థానికులు కాపాడారు. వాగుల్లో వరద ప్రవాహం తగ్గిన తరువాత ఆయా గ్రామాల ప్రజ లు తమ రాకపోకలు కొనసాగించారు. ఆదిలా బాద్ – భీం పూర్,కరంజి(టి) రూట్లో లక్ష్మీపూర్ వద్ద వాగు కల్వర్టుపై నుంచి వరద ప్రవహిం చడంతో పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. పోలీ సులు నాగనాథ్, ఉత్తం, శ్రీనివాస్ వాగుల పరిస్థితి తెలుసుకుంటూ అప్రమత్తం చేశారు.
మత్తడి దుంకుతున్న పార్డి(కే) చెరువు
కుభీర్, సెప్టెంబర్ 3: పార్డి(కే) పెద్ద చెరువు (కస్రా రిజర్వాయర్) నిండు కుండను తలపిస్తున్నది. మండలంలోని పార్డి(బీ), చాత, డోడర్న, పల్సిలోని చెరువులు వరదతో కళకళ లాడుతున్నాయి. పార్డి(కే)లోని చెరువు దుంకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాలింతను వాగు దాటించిన స్థానికులు
పెంబి, సెప్టెంబర్ 3: వారం నుంచి కురుస్తున్న వర్షాలకు దోత్తివాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు సాగించేందుకు వీలు పడడం లేదు. దోందారి గ్రామానికి చెందిన నైనెని లక్ష్మికి ఐదు రోజుల క్రితం గ్రామంలో సాధారణ ప్రసవం కాగా, శుక్రవారం నిర్మల్ దవాఖానకు తీసుకెళ్లారు. దోత్తివాగు ప్రవహిస్తుండడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు బాలింత, పసిబిడ్డను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చారు. వంతెన లేక దోత్తి వాగు అవతల ఉన్న దోందారి, యాపల్‌గూడ, రాంనగర్‌తో పాటు పలు గ్రామాల గిరిజన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వాగుపై వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో పనులు ప్రారంభించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు.
జలపాతం చూసేందుకు వచ్చి
మామడ, సెప్టెంబర్ 3: జలపాతం అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఒక్కసారిగా వాగు ఉప్పొంగడంతో అటవీ ప్రాంతంలో చిక్కుకున్నారు. మామడ మండలంలోని వాస్తా పూర్ జలపాతం చూసేందుకు హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం, నిర్మల్‌కు చెందిన యువ కులు మొత్తం 16 మంది మధ్యాహ్నం చేరుకు న్నారు. జలపాతం ఎగువ ప్రాంతంలో వర్షం కుర వడంతో వాగులో నీటిమట్టం ఒకేసారి పెరిగింది. దీంతో సందర్శకులు అవతలి ఒడ్డున ఉండిపో యారు. సమాచారం తెలుసు కున్న ఎస్ఐ వినయ్, సర్పంచ్ సంతోష్ సంఘటనా స్థలానికి వెళ్లి పర్యాటకులకు ధైర్యం చెప్పారు. గ్రామస్తులు తాళ్ల సాయంతో 16 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తమను ఒడ్డుకు చేర్చిన పోలీసులు, స్థానికులకు కృతజ్ఞ తలు తెలిపారు.