
నిర్మల్ కలెక్టర్ ముషాఫ్ అలీ ఫారూఖీ
మామడ, లక్ష్మణచాంద, కడెం మండలాల్లో పాఠశాలల సందర్శన
ఇద్దరు హెచ్ఎంల సస్పెన్షన్, ఒకరికి షోకాజ్
మామడ, సెప్టెంబర్ 2: విద్యార్థులకు మెనూ ప్రకారం మ ధ్యా హ్న భోజనం అందించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. మండలంలోని పొన్కల్ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయన, నీరు నిల్వ ఉండకుండా చూడాలని సూచించా రు. డీఈవో టామ్నె ప్రణీత, సర్పంచ్ భూమేశ్వర్, హెచ్ఎం రాం చందర్, ఎంపీడీవో రమేశ్, ఎంపీవో కలీం, పంచాయతీ కార్యదర్శి సాయిక్రిష్ణారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.
హెచ్ఎంపై సస్పెన్షన్ వేటు
లక్ష్మణచాంద, సెప్టెంబర్ 2: మండలంలోని లక్ష్మణచాంద, చా మన్పెల్లి ఉన్నత పాఠశాలలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫా రూఖీ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని, పాఠశాలలో పాటిస్తున్న కరోనా నిబంధనలను పరిశీలించారు. చామన్‌పెల్లి ఉన్నత పాఠశాల ఆవరణ బురదయమంగా ఉండడంతో హెచ్ఎం షేక్హుస్సేన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గదిని పరిశీలించారు. సిలిండర్ లేకపోవడంపై ప్రశ్నించారు. సరియైన సమాధానం ఇవ్వకపోవడంతో, హెచ్ఎంను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. డీఈవో టామ్నె ప్రణిత ఉన్నారు.
కడెం, సెప్టెంబర్ 2: మండలంలోని పెద్ద, చిన్న బెల్లాల్ గ్రా మాల ప్రభుత్వ పాఠశాలలను గురువారం డీఈవో టామ్నె ప్రణితతో కలిసి కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తనిఖీ చేశా రు. పాఠశాల పరిసరాలను, వంట గదిని పరిశీలించి, వి ద్యా ర్థులతో మాట్లాడారు. పాఠశాల పరిసరాలు అపరిశు భ్రంగా ఉండడం, కట్టెల పొయ్యిపై వంట చేస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న బెల్లాల్ హెచ్ఎంను సస్పెండ్ చేయాలని, పెద్ద బెల్లాల్ హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డీఈవోను ఆదేశించారు. తహసీల్దార్ కలీం, ఎంపీడీవో వెంకటేశ్వ ర్లు, ఉపాధ్యాయులు తదితరులున్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 2: నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమి టీ కార్యాలయంలోని గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులతో కలిసి గురువా రం పరిశీలించారు. ఈవీఎంల భద్రత, తదితర అంశాలపై జి ల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్అండ్బీ జిల్లా అధికారి అశోక్‌కుమార్, తహసీల్దార్ సుభాష్‌రావు, తదితరులున్నారు.
భూసేకరణ సత్వరం పూర్తి చేయాలి
నిర్మల్ జిల్లాలో రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు, కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రె వెన్యూ అధికారులను ఆదేశించారు. సదర్మాట్ 27వ ప్యాకేజీ పనుల భూసేకరణ అంశంపై గురువారం సాయంత్రం కలెక్టరే ట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. జలవనరులశాఖ, రెవెన్యూ, ల్యాండ్ రికార్డు సర్వే అధికారులతో సమావేశం నిర్వహించి భూసేకరణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ రాంబాబు, నీటిపారుదలశాఖ ఎస్ఈ సుశీల్‌కుమార్, ఈఈ రామారావు, డీఈ జగదీశ్వర్, తదితరులున్నారు.