
కరోనా కష్టకాలంలోనూ పేదలకు అండగా నిలిచిన రాష్ట్ర సర్కారు
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
కుంటాల, సెప్టెంబర్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశంలోనే ఆ దర్శంగా నిలుస్తున్నాయని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలో గురువారం ఆయన పర్యటించారు. స్థానిక రైతు వేదికలో 59 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ, సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయకుండా అన్ని వర్గాల ప్రజలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. దళిత బంధు పథకాన్ని నియోజకవర్గం లో వీలైనంత త్వరగా అమలయ్యే విధంగా చర్య లు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి నిధుల మంజూరు కు కృషి చేస్తానని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న చె క్కులను త్వరితగతిన మంజూరు చేయిస్తానని అ న్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. గ్రామ సర్పంచ్ దొనికెన సమత వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గ జ్జారాం, జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, ఆత్మ చైర్మన్ సవ్వి అశోక్ రెడ్డి, సర్పం చ్ల సంఘం అధ్యక్షుడు ముజిగే ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ పడకంటి దత్తు, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో దేవేందర్ రెడ్డి, ఆ యా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జెండా పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే
మండలంలోని అందకూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా పండు గ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. స్థానికులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పని చే స్తున్నదని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పార్టీ పటిష్టానికి కృషి చే స్తున్న కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉం టుందని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ దాసరి కిషన్, పార్టీ మండల కన్వీనర్ దత్తు, స్థానిక నా యకులు పాల్గొన్నారు.
గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి
కుంటాల మండల ప్రజల ఇలవెల్పు అయిన గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. జడ్పీ నిధులు రూ. 2.50 లక్షలతో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, మూత్ర శాలల పనులకు ఆయన భూమి పూజ చేశారు. ప్రహరీ, గాలి గోపురం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ నుంచి గతంలో రూ. 24 లక్షలు ఆలయ అభివృద్ధికి వెచ్చించినట్లు తెలిపారు. అం తకుముందు గజ్జలమ్మ దేవిని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.