
ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
బోథ్, సెప్టెంబర్ 2: అందరి సహకారంతో అ జ్జర్-వజ్జర్‌ను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ సిక్తాపట్నాయక్ అన్నారు. మండలంలోని ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపికైన అజ్జర్-వజ్జర్ (మహదుగూడ) లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రణాళికాబద్ధంగా వెళ్తే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంప్ యార్డు వంటి నిర్మాణాలను చేపట్టిందన్నారు. మహదుగూడ, లెండిగూడ గ్రా మాల ప్రజలు తమ అవసరాలు, కావాల్సిన ప నులను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూ చించారు. ఎంపీ సోయం బాపురావ్ మాట్లాడు తూ ఏడాది కాలంలో గూడేల అభివృద్ధికి కావా ల్సిన నిధులు మంజూరు చేయిస్తానన్నారు. అం తకుముందు పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించా రు. కాగా, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వస్తుండడంతో ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వ హించారు. సర్పంచ్ భూంబాయి, ఎంపీటీసీ సి డాం సంభు, ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ భా షా షేక్, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, ఎస్ ఈ ఉత్తం జాడే, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, రైల్వే బోర్డు సభ్యుడు జీవీ రమణ, జీ రాజుయాదవ్, సుభాష్ సూర్య, ఎంపీడీవో సీహెచ్ రాధ, ఎంపీవో జీవన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
గుడిహత్నూర్,సెప్టెంబరు 2: సీజనల్ రోగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మచ్చాపూర్ గ్రా మంలో జై దేవి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గు రువారం మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గిత్తె మదన్‌ను అభినందించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచు కోవాలని స్థానికులకు సూచించారు. శిబిరంలో 300 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, సర్పంచ్ ఆడె సంగీత, మండల వైద్యాధి కారి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు రాథోడ్ ప్రతాప్, జాదవ్ రాంజీ, ఆడె గుణవంత్‌రావ్, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.