
ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
కష్టపడ్డవారికి తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది..
అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
ఖానాపూర్ టౌన్ /పెంబి / కడెం/ దస్తురాబాద్/ ఉట్నూర్, సెప్టెంబర్ 1 : ఖానాపూర్ నియోజకవర్గంలోని ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్కొన్నారు. ఖానాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, పెంబి, కడెం, దస్తురాబాద్, ఉట్నూర్ మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో బుధవారం మండల స్థాయి విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు. జెండా పండుగపై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు గురువారం ప్రతి గ్రామంలో గ్రామ కమిటీల అధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. త్వరలో గ్రామ, మండల, జిల్లా స్థాయి నూతన కమిటీల ఎన్నిక ఉంటుందని తెలిపారు. గురువారం నుంచి ఈ నెల 12 వరకు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలు ఏర్పా టు చేయాలని, ఈ నియామకంలో మండల ప్రజాప్రతిధులు బాధ్యత వహించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు ఈ కమిటీల్లో గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. అంతకుముందు దస్తురాబాద్ మండలంలోని పలువురు లబ్ధిదారులకు మం జూరైన కల్యాణలక్ష్మి, సీఎం సహాయ నిధి చెక్కులను ఆమె ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి పంపిణీ చేశారు. సమావేశాల్లో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ పుప్పాల శంకర్, పీఏసీఎస్ చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, అమంద శ్రీనివాస్, వైస్ ఎంపీపీ వాల్సింగ్, మాజీ జడ్పీటీసీ రాథోడ్ రామునాయక్, మండల, పట్టణ అధ్యక్షులు రాజగంగన్న, పరిమి సురేశ్, పెంబి మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీపీ భుక్యా కవిత, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బానావత్ విలాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ భుక్యా గోవింద్, ఎంపీటీసీ రామారావు, కడెం జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు తక్కళ్ల సత్యనారాయణ, భూక్యా బాపురావ్, ఆకుల లచ్చన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు కన్నె శ్రీనివాస్, మండల కన్వీనర్ కానూరి సతీశ్, సర్పంచుల ఫోరం సంఘం అధ్యక్షుడు గోళ్ల వేణుగోపాల్, గౌరవ అధ్యక్షుడు మేకల రాజారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్హైమద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పా ల శంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ చక్రపాణి, ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ముడికె మల్లేశ్, ఎంపీటీసీల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి కట్ల సింధూజ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సత్యం, బోయిని మంగ, దస్తురాబాద్ ఎంపీపీ సింగరి కిషన్, వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సిర్ప సంతోష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్‌రావు, వైస్ ఎంపీపీ బాలాజీ, కోఆప్షన్ సభ్యుడు రషీద్, రైతుబంధు సమితి మం డల అధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దీన్, మండలాధ్యక్షుడు సిం గారే భరత్, మాజీ అధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, ఆయా మండలాల పీఏసీఎస్ వైస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, ఆయా సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జెండా పండుగను జయప్రదం చేయండి
నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 1 : సీఎం కేసీఆర్ పిలుపుమేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశానుసారం గురువారం నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లో నిర్వహించే జెండా పండుగను జయప్రదం చేయాలని పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము పిలుపునిచ్చారు. నిర్మల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్‌కు, కౌన్సిలర్లకు బుధవారం పార్టీ కండువాలు, సామగ్రిని అందజేశారు. అన్ని వార్డుల్లో కార్యకర్తలు, నాయకులు జెండా పండుగలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.