
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
వైఎస్సార్ కాలనీలో అవగాహన సదస్సు
నిర్మల్ టౌన్, సెప్టెంబరు 1 : నిర్మల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో సీజనల్ వ్యాధులపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కాలనీవాసులకు దోమల నివారణ మందులను పంపిణీ చేశారు. జిల్లాలో డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అసలే వానలు పడుతున్న తరుణంలో ఇంటి ముందర నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని తెలిపారు. పాడుబడిన టైర్లు, ఇతర వస్తువులను దూరంగా ఉంచాలని సూచించారు. కాలనీలో మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, వైస్ చైర్మన్ సాజిద్ పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై చర్యలు చేపట్టాలి
నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే సత్వరం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, పరిరక్షణ, తదితర అంశాలపై జిల్లా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున భూవివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రికార్డుల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు భూములను గుర్తించి సరిహద్దులను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే ఆక్రమించుకున్న వారికి నోటీసులు పంపి భూవివరాలను తెలుసుకొని తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ధరణి వెబ్సైట్ ద్వారా అందిస్తున్న సేవలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించి భూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఆర్డీవో రమేశ్ రాథోడ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
పంట కల్లాలను సత్వరం పూర్తి చేయాలి..
నిర్మల్ జిల్లాలో రైతుల ప్రయోజనం కోసం నిర్మిస్తున్న పంట కల్లాల నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పం ట కల్లాల నిర్మాణంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిర్మల్ జిల్లా లో ఇప్పటివరకు మంజూరైన పంట కల్లాలు, పూర్తయినవి, పనులు జరుగుతున్న వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు ప్రారంభమైన చోట పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ పంట కల్లాల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నా రు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా వ్య వసాయశాఖ అధికారి అంజిప్రసాద్, పంచాయతీరాజ్ ఈఈ శం కరయ్య, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.