Santosh Sobhan
Santosh Sobhan | కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథల్ని ఎంచుకొని ప్రయాణం చేస్తున్నారు యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Sobhan).
ఆయన తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించారు. స్వప్నదత్ (Swapna Dutt), ప్రియాంకదత్ (Priyanka Dutt) నిర్మించారు.
ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం హీరో సంతోష్‌శోభన్ (Santosh Sobhan) పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) చిత్రంలో నేను రిషి అనే యువకుడి పాత్రలో కనిపిస్తా. నవ్వుతూ జీవితాన్ని గడుపుతూ అందరిని నవ్వించాలన్నదే అతని లక్ష్యం.
ఉమ్మడి కుటుంబంలో రిషి జీవితం ఎలా సాగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. గత చిత్రాల్లో నేను ఎక్కువగా సీరియస్ రోల్స్ చేశాను.
కానీ ఈ సినిమాలో మాత్రం వాటికి పూర్తి భిన్నంగా నా పాత్ర వినోదాత్మకంగా సాగుతుంది. నందిని రెడ్డి (Nandini Reddy) సినిమాలను నేను బాగా ఇష్టపడతాను.
ఆమె నుంచి సినిమా ఆఫర్ రాగానే వెంటనే అంగీకరించా. ఈ సినిమా టైటిల్ చూస్తేనే నిజాయితీగా చేసిన ప్రయత్నం అనిపిస్తుంది.
ఇటీవల ఈ సినిమాను ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా చూశా. బయటకు వచ్చాక మనసంతా హాయిగా అనిపించింది. ఈ సినిమా విజయానికి అదే శుభశకునమని భావించా.
ఈ సినిమాలో మూడు తరాల నటీనటులు కనిపిస్తారు. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలుంటాయి.
‘తొలి ప్రేమ’ (Tholi Prema) చిత్రంలో నటి వాసుకి (Vasuki)ని చూసిన చాలా మంది తమకు అలాంటి చెల్లెలు ఉంటే బాగుండేదనుకున్నారు.
ఈ సినిమాలో తను నా అక్కయ్య పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత అలాంటి అక్క ఉంటే బాగుంటుందనే భావన కలుగుతుంది.
నాన్న చనిపోయిన తర్వాత అమ్మ అన్నీ తానై నన్ను చూసుకుంది. ఆమె ప్రేమకు వెలకట్టలేను. కెరీర్‌పరంగా అమ్మ ఇచ్చిన ధైర్యం మరచిపోలేనిది.
మాకు సొంత ఇల్లు లేదు. అమ్మకు ఓ మంచి ఇల్లును బహుమతిగా అందించాలనుకుంటున్నా.
Santosh Sobhan At Anni Manchi Sakunamule Movie Interview Photos
Santosh Sobhan At Anni Manchi Sakunamule Movie Interview Photos