Apps:
Follow us on:

Samyuktha Menon | దర్శకుడు అలా కనిపించాలని అనేవాడు : సంయుక్త మీనన్‌

1/16Samyuktha Menon | ‘భీమ్లా నాయక్‌’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నాయిక సంయుక్త మీనన్ (Samyuktha Menon). ‘బింబిసార’ (Bimbisara), ‘సార్’ (Sir) వంటి విజయాలతో ఆమె టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2/16సాయిధరమ్‌ తేజ్ (Sai Dharam Tej) సరసన సంయుక్త నటించిన కొత్త సినిమా ‘విరూపాక్ష’ (Virupaksha). ఈ చిత్రానికి కార్తీక్‌ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహించారు. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.
3/16ఈ నెల 21న పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలు తెలిపింది సంయుక్త మీనన్ (Samyuktha Menon).
4/16మిస్టిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. హారర్‌ ఎలిమెంట్స్‌ ఉండవు. కానీ థ్రిల్లర్‌ అంశాలే కొద్దిగా భయపెడతాయి. ఈ సినిమా రుద్రవనం అనే ఒక కాల్పనిక ఊరిలో జరుగుతుంది.
5/16కొండల మధ్య ఉన్న ఆ గ్రామంలో ఉండే అమ్మాయి నందిని పాత్రలో కనిపిస్తాను. ఆమెకు ఆత్మవిశ్వాసం, పొగరు ఎక్కువ. మాటలో, ప్రవర్తనలో ఆధిపత్యం చూపిస్తుంది.
6/16ఆ ఊరికి సూర్య (సాయిధరమ్‌ తేజ్ (Sai Dharam Tej)) వస్తాడు. అతని మాటలను నందిని పట్టించుకోదు. ఇది మా ఊరు. మా ఊరి గురించి మాకు తెలుసు అన్నట్లు ప్రవర్తిస్తుంది.
7/16నేను ఈ పాత్రలో నటిస్తున్నప్పుడు కొంచెం వినయంగా ఉన్నా, దర్శకుడు అలా వద్దు పొగరుగానే కనిపించాలని చెప్పేవారు. ఈ పాత్రకు, వ్యక్తిగతంగా నా స్వభావానికి ఎలాంటి పోలిక లేదు.
8/16ఇలాంటి సినిమాల మేకింగ్‌కు బాగా టైమ్‌ తీసుకోవాలి. దర్శకుడు కార్తీక్‌ అయితే ఇప్పటికీ ఇంకొక నెల టైమ్‌ ఇస్తే బాగుండు అంటుంటారు.
9/16నేను తెలుగులో ఒప్పుకున్న తొలి సినిమా బింబిసార (Bimbisara). ఆ తర్వాత విరూపాక్ష (Virupaksha). ప్రీ ప్రొడక్షన్‌ మొదలైంది. నాకు ఒక్క ముక్క తెలుగు రాదు.
10/16నా ఇంట్రడక్షన్‌ సీన్‌ కోసం 60 నుంచి 70 పేజీల డైలాగ్స్‌ ఇచ్చారు. ఆ పేపర్స్‌ చూసి వణికిపోయాను. భాష రాకుండా ఎలా నటించగలను అనిపించింది.
11/16ఏదో ప్రాప్టింగ్‌ చెబితే సరిపోదు ఆ పాత్రలా మారిపోయి అభినయించాలి. భాష తెలిస్తేనే అది సాధ్యం. సెకండ్‌ వేవ్‌ సమయంలో తెలుగు ట్యూటర్‌ను పెట్టుకుని భాష నేర్చుకోవడం మొదలుపెట్టాను.
12/16అదృష్టవశాత్తూ ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత దక్కింది. ప్రతి క్యారెక్టర్‌ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుంది.
13/16ఇలా అన్ని పాత్రలు కీలకంగా ఉండే స్క్రిప్ట్‌ కుదరడం అరుదు. ఒక్కో సీన్‌లో ఆరేడుగురు నటీనటులు ఉంటారు. యాంకర్‌ సుమ కూడా మంచి క్యారెక్టర్‌లో కనిపిస్తుంది.
14/16అతను మంచి కోస్టార్‌. యాక్సిడెంట్‌ ముందు, తర్వాత సాయిలో చాలా మార్పు చూశాను. జీవితంలో ఒక ప్రమాదం జరిగిన తర్వాత దాని నుంచి కోలుకుని మళ్లీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం అంత సులువు కాదు. సాయితేజ్‌ ఈ విషయంలో ఎంతో కష్టపడ్డాడు. సూర్యగా అతని పర్మార్మెన్స్‌ ఆకట్టుకుంటుంది.
15/16ఇప్పటిదాకా నన్ను ప్రేక్షకులు సంప్రదాయంగా కనిపించే ఒక అమ్మాయి క్యారెక్టర్స్‌లో ఆదరించారు. వారు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలాంటి పాత్రలనే ఎంచుకుంటాను.
16/16కొన్ని ప్రాజెక్టులకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటిస్తా.