Rashmika Mandanna | రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘రెయిన్‌బో’ (Rainbow). దేవ్ మోహన్ (Dev Mohan) కీలక పాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని అమల (Amala Akkineni) క్లాప్‌నిచ్చారు.
5/25
నిర్మాతలు మాట్లాడుతూ…“ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సినిమా తర్వాత మేము తెలుగులో నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు ఓ వైవిధ్యమైన కథను సిద్ధం చేసుకున్నారు.
6/25
ప్రతిభ గల నటీనటులు, సాంకేతిక నిపుణులతో ఆకట్టుకునేలా సినిమాను నిర్మిస్తాం. ఈ నెల 7వ తేదీ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు.
7/25
దర్శకుడు శాంతరూపన్ (Shantharuban) మాట్లాడుతూ…‘ఈ కథను అంగీకరించిన రష్మిక (Rashmika Mandanna)కు థాంక్స్. ఈ సంస్థలో ఎలాంటి వైవిధ్యమైన చిత్రాలు నిర్మితమయ్యాయో చూశాం.
8/25
ఈ సినిమా కూడా వాటి తరహాలోనే కొత్తగా ఉంటుంది’ అన్నారు.
9/25
నాయిక రష్మిక మందన్న (Rashmika Mandanna) మాట్లాడుతూ…‘దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకుంది. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది.
10/25
నటుడు దేవ్ మోహన్ (Dev Mohan) మాట్లాడుతూ…‘తెలుగులో నా మొదటి సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam) విడుదలకు సిద్ధమవుతున్నది.
11/25
ఇంతలోనే మరో మంచి ప్రాజెక్ట్ దక్కినందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కే.ఎం. భాస్కరన్, సంగీతం : జస్టిన్ ప్రభాకరన్