Rakul Preet Singh | ఆ పద్ధతి మారితేనే సినీరంగంలో మంచి మార్పులొస్తాయి : రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh
2/42
Rakul Preet Singh | కథానాయికలకు అందించే పారితోషికం విషయంలో దర్శకనిర్మాతలు వివక్ష చూపిస్తున్నారనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది.
3/42
హీరోలతో పోల్చితే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ దక్కుతున్నదని పలువురు అగ్ర నాయికలు ఆరోపిస్తున్నారు.
4/42
తాజాగా ఈ విషయం గురించి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) స్పందించింది.
5/42
కథానాయికల పర్‌ఫార్మెన్స్ వల్ల భారీ విజయాలు దక్కించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయని, అలాంటప్పుడు పారితోషికం విషయంలో అంతా తేడా ఎందుకని ఈ భామ ప్రశ్నించింది.
6/42
ఆమె మాట్లాడుతూ ‘హీరోయిన్లు పాటలకు, ఏవో కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యే రోజులు పోయాయి.
7/42
ఇప్పుడు నాయికలు కథాగమనంలో కీలకంగా ఉంటున్నారు. అభినయ ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు.
8/42
అగ్ర నటీమణులకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. కొన్ని మహిళా ప్రధాన చిత్రాలు వందకోట్ల వసూళ్లు దాటిన సందర్భాలున్నాయి.
9/42
అందుకే పారితోషికాల విషయంలో వివక్ష చూపించొద్దు. ఈ పద్ధతి మారితేనే సినీరంగంలో మంచి మార్పులొస్తాయి’ అని చెప్పింది.
10/42
గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ భామ హిందీ, తమిళంలో మాత్రం వరుస సినిమాలతో బిజీగా మారింది.