Lavanya Tripathi
Lavanya Tripathi | మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), నటి లావణ్యల త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.
గతకొన్నేళ్లుగా ప్రేమలో ఉంటున్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.
ఈ క్రమంలో వీరి ఎంగేజ్‌మెంట్ శుక్రవారం సాయంత్రం నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తుంది.
మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఫ్యామిలీలు మాత్రమే ఈ వేడుకలో సందడి చేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో జరుగనున్నట్లు తెలుస్తుంది.
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ (Mister) సినిమాలో తొలిసారి వరుణ్ (Varun Tej), లావణ్యలు (Lavanya Tripathi) కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది.
కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు.
ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గాండీవధారి అర్జున చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షీ వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.
దీనితో పాటుగా ఓ కొత్త దర్శకుడితో ఏయిర్ ఫోర్స్ కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి ఇటీవలే పులిమేక వెబ్ సిరీస్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. గతేడాది హ్యపీ బర్త్ డే సినిమాతో అలరించింది.
జీ-5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చింది. గతేడాది హ్యపీ బర్త్ డే సినిమాతో అలరించింది.