Kushboo | ఆ సీనియర్ హీరోతో రొమాన్స్ చేసినందుకు టబుపై ఖుష్బూ ఫైర్..!
Kushboo
2/25
Kushboo | మూవీ లవర్స్‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఖుష్బూ (Kushboo). తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
3/25
ప్రస్తుతం గోపీచంద్ (Gopichand) హీరోగా నటిస్తున్న రామబాణం (Ramabanam) కీలక పాత్రలో ఖుష్బూ (Kushboo) నటిస్తోంది.
4/25
ఈ చిత్రం మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ (Kushboo) మీడియాతో చిట్ చాట్ చేశారు. రామబాణం (Ramabanam) విశేషాలు ఖుష్బూ (Kushboo) మాటల్లోనే..
5/25
నా హృదయానికి దగ్గరగా ఉన్న సినిమా ఇది. ఈ సినిమా నుంచి బంధుత్వాల విలువ ఎంత ముఖ్యమైందో తెలుసుకున్నా. ఎప్పుడూ సంపాదనే కాదు..
6/25
ఈ సినిమా మీ ప్రియమైన వారిని కలిసి ఉంచేలా చేస్తుంది. ఇందులో నేను సేంద్రీయ, సంప్రదాయ ఆహారం ప్రాధాన్యతను ప్రమోట్ చేసే పాత్రలో కనిపిస్తా.
7/25
నిల్వ ఉంచిన ఆహారాన్ని అధికంగా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. తరచుగా ప్యాక్ చేసిన ప్యాకెట్లలో వచ్చే ఫాస్ట్ ఫుడ్‌తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
8/25
టెర్రకోట, సాంప్రదాయ గ్రైండర్లతో గ్రైండింగ్ లాంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగించి రుచికరమైన ఆహారాన్ని తయారు చేయవచ్చు.
9/25
నేటి కాలంలో ప్రజలు ఫాస్ట్ ఫుడ్‌ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడమే రామబాణం ప్రధాన నినాదం.
10/25
నేను, గోపీచంద్ (Gopichand) కాంటాక్ట్ వివరాలు ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఫొటోలు తీసుకోవడం కానీ చేయలేదని చివరి రోజు షూటింగ్లో రియలైజ్ అయ్యాం.
11/25
గోపీచంద్ (Gopichand) రిజర్వ్డ్ పర్సన్ అయినప్పటికీ సెట్స్‌లో ఫన్నీగా ఉంటాడు.. జగపతిబాబు (Jagapathi Babu) నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన ప్రొడక్షన్ హౌజ్‌లో కూడా పనిచేశా.
12/25
నా మైండ్‌లో ప్రత్యేకించి ఇలాంటి పాత్ర అని ఏం లేదు. ప్రత్యేకమైన పాత్రేమి చేయలేదని ఎప్పుడూ ఫీల్ కాలేదు.
13/25
కానీ నిజంగా చెప్పాలంటే.. టబు (Tabu), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తో చేసిన Cheeni Kum సినిమా చూసి అసూయ వేసింది.
14/25
నేను ఎంతగానో అభిమానించే అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)తో రొమాన్స్ చేసినందుకు టబు (Tabu)పై (నవ్వుతూ) ఫైర్ అయ్యా.
15/25
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశా. కానీ దురదృష్ణవశాత్తు గెలువలేదు. కానీ ఇప్పుడు నేను పోటీ చేయాలా..? వద్దా అనేది పార్టీ నిర్ణయిస్తుంది.
16/25
సినిమాలు, రాజకీయాలు బ్యాలెన్స్ చేయగలనన్న నమ్మకం నాకుందని ఖుష్బూ (Kushboo) చెప్పారు.
17/25
ఒకవేళ అవకాశమొస్తే చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమాల్లో నటిస్తానని ఖుష్బూ (Kushboo) తెలిపారు.
18/25
ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ వారితో పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదు. సరైన కథ వస్తే వారితో కలిసి పనిచేస్తానని ఖుష్బూ (Kushboo) అన్నారు.