Catherine Tresa
Catherine Tresa | ‘ఆహా’ (Aha) ఓటీటీలో విడుదలై అందరి ప్రశంసలు అందుకున్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ (Odela Railway Station) చిత్ర దర్శకుడు అశోక్ తేజ (Suddala Ashok Teja) దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.
పాపులర్ కథానాయిక కేథరిన్ థెరిసా (Catherine Tresa) హీరోయిన్‌గా, జార్జిరెడ్డి (George Reddy), వంగవీటి (Vangaveeti) చిత్రాల కథానాయకుడు సందీప్ మాధవ్ (Sandeep Madhav) హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేసీఆర్ ఫిలిమ్స్, శ్రీమహా విష్ణు మూవీస్ బ్యానర్‌లపై దావులూరి జగదీష్ (Davuluri Jagadeesh), పల్లి కేశవరావు (Palli Kesava Rao)లు నిర్మిస్తున్నారు.
హీరో, హీరోయిన్లలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) క్లాప్ నివ్వగా, నిర్మాత సి.కల్యాణ్ (C Kalyan) కెమెరా స్విఛాన్ చేశారు. ప్రసన్నకుమార్ (Prasanna Kumar), జెమిని కిరణ్ (Gemini Kiran)లు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ “ఓదెల రైల్వేస్టేషన్’ (Odela Railway Station)ను చూసి నాకు ఈ అవకాశం ఇచ్చారు నిర్మాతలు.
కథ వినగానే కేథరిన్ (Catherine Tresa), హీరో సందీప్‌లు (Sandeep Madhav) ఎంతో ఆసక్తి చూపించారు. ‘జార్జిరెడ్డి’ (George Reddy) తరువాత ఎన్నో కథలు విన్న సందీప్ (Sandeep Madhav) ఈ కథ వినగానే ఓకే చేశాడు.
నా ‘ఓదెల రైల్వేస్టేషన్’ (Odela Railway Station)కు పదిరెట్లు అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. హీరోయిన్ కేథరిన్ థెరిసా (Catherine Tresa) మాట్లాడుతూ ‘కథ వినగానే ఎంతో నచ్చింది.
స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా ఇది. సరికొత్త యాక్షన్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది’ అన్నారు.
కథానాయకుడు సందీప్ మాధవ్ (Sandeep Madhav) మాట్లాడుతూ ‘ జార్జిరెడ్డి (George Reddy) తరువాత చాలా కథలు విన్నాను. కానీ ఈ కథ వినగానే ఎంతో బాగా నచ్చింది.
ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. సినిమాలో వుండే ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరు.
చాలా కాలంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాలని మంచి కథ కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాలో అలాంటి పాత్ర దొరికింది.
హీరోయిన్ కేథరిన్ (Catherine Tresa) పాత్రను కూడా దర్శకుడు ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని రీతిలో డిజైన్ చేశాడు. సినిమాకు మంచి టీమ్ కుదిరింది’ అన్నారు.
చిత్ర సమర్పకుడు సోమ విజయప్రకాష్ (Soma Vijay Prakash) మాట్లాడుతూ ‘ఇంతవరకు నేను వినని సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. చివరి వరకు సినిమాలో ఉండే ట్విస్ట్‌లు ఎవరూ ఊహించలేరు.
అందరి ఊహలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మిస్తున్నాం’ అన్నారు.
నిర్మాతల్లో ఒకరైన పల్లి కేశవరావు (Palli Kesava Rao) మాట్లాడుతూ ‘కొంత విరామం తరువాత నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నాను.