ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) నిర్మిస్తున్నారు.
4/19
కార్తీక్ జి.క్రిష్ (Karthik G. Krish) దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది.
5/19
ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో సిద్ధార్థ్ (Siddharth) మాట్లాడుతూ….‘ఈ ఆగస్టుకు నేను హీరోగా పరిచయమై 20 ఏండ్లవుతున్నది.
6/19
ఇప్పటికీ నాకు మంచి అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. నేను నటించిన పూర్తి కమర్షియల్ చిత్రమిది.
7/19
దర్శకుడు కార్తీక్ (Karthik G. Krish) నన్ను సరికొత్తగా తెరపై చూపించాడు. యాక్షన్, రొమాంటిక్ అంశాలతో సినిమా సాగుతుంది.
8/19
ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకే దాదాపు 35 రోజుల సమయం వెచ్చించాం.
9/19
దివ్యాంశ కౌషిక్ (Divyansha Kaushik) పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఈ ప్రేమకథ ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’ అన్నారు.
10/19
దర్శకుడు కార్తీక్ జి.క్రిష్ (Karthik G. Krish) మాట్లాడుతూ…‘ఇది నేటితరం సినిమా అని చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్ (Siddharth)ను లవర్బాయ్లా కొత్తగా చూపిస్తున్నాను.
11/19
లవ్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలుంటాయి. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది’ అన్నారు.
12/19
సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) మాట్లాడుతూ..‘గతంలో సిద్ధార్థ్ (Siddharth) సినిమాలు ఎంతగా ఆదరణ పొందాయో చూశాం.
13/19
ఈ సినిమా కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుంది’ అన్నారు.