Nani
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల చిత్రాల్లో నటించాలని ఉంది అంటున్నారు హీరో నాని (Nani).
వైవిధ్యమైన కథల్లో కనిపించాలనే ప్రయత్నంలోనే తాను ‘దసరా’ (Dasara) చిత్రంలో నటించానని చెబుతున్నారు.
శ్రీకాంత్ ఓదెల (Srikanth Odhela) దర్శకత్వంలో నాని (Nani) నటించిన ఈ పాన్ ఇండియా (Pan India) సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా తన సంతోషాన్ని తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు నాని (Nani).
నాకు పాన్ ఇండియా (Pan India) అనే ట్యాగ్ నచ్చదు. మొదటి నుంచీ మా సినిమా ఐదు భాషల్లో విడుదలవుతుంది అని చెబుతున్నాం.
ఉత్తరాదికి ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా పాన్ ఇండియా (Pan India) పదాన్ని నేను వాడలేదు. ఎంత వసూళ్లు వస్తున్నాయనే నెంబర్స్ కంటే ఇంతమందికి మా సినిమా నచ్చిందనే విషయం సంతోషాన్ని ఇస్తున్నది.
సినిమా విడుదలైనప్పటి నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. పెద్ద పెద్ద వాళ్లంతా సోషల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ చెబుతున్నారు.
ఈ సినిమా విడుదల ముందు నేను ప్రచార కార్యక్రమాల్లో చెప్పిన మాటలు చూసి కొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నారు. కానీ ఇవాళ చిత్ర విజయం నా నమ్మకాన్ని నిలబెట్టింది.
ఈ చిత్రంలో ప్రతి సన్నివేశంలో కష్టపడి నటించాం. ఏదీ ఆస్వాదించి చేసింది లేదు. ఎందుకంటే సెట్‌లో మొత్తం దుమ్ము, వేడి ఉండేది.
కష్టపడి సినిమా చేశాం. కానీ ఆ సీన్స్ బాగా వస్తున్నాయనే సంతోషం ఉండేది. ఈ సన్నివేశం థియేటర్‌లో చూడాలి అనిపించింది మాత్రం క్లైమాక్స్.
దాన్ని థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి ఎప్పుడు చూస్తామా అని ఎదురుచూశా. ఇంటర్వెల్ సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నప్పుడు సెట్‌లో ఆన్‌లైన్ ఎడిటింగ్ ఫుటేజ్ చూసి ఆశ్చర్యపోయాం.
ఆ పోలిక సంతోషాన్నిస్తుంది. కానీ నటుడిగా నేనెప్పుడూ సంతృప్తి పడను. ఇదే కాదు నేను నటించబోయే ఏ సినిమాకూ నటుడిగా సంతృప్తి చెందను.
అలాంటి అనుభూతి కలిగినప్పుడు నేను నటుడిగా కొత్తగా చేసేందుకు ఏమీ ఉండదు.
కథ విన్న వెంటనే ఒక కొత్త వాయిస్ విన్న అనుభూతి కలిగింది. పరిశ్రమలో ఉన్న గొప్ప సాంకేతిక నిపుణులను ఈ సినిమా కోసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.
దర్శకుడు కొత్తవాడు అనేది రాకూడదు. అతనిలో ప్రతిభ ఉంది. గొప్ప దర్శకుడు అవుతాడని నా మిత్రులకు చాలా మందికి చెప్పాను.
కథలోని స్నేహం, ప్రేమ, పగ అనే అంశాలు ఏ భాషలోని ప్రేక్షకుడికి అయినా చేరువవుతాయి. అందుకే వివిధ భాషల్లో సినిమాను విడుదల చేయాలని అనుకున్నాం.
మన సంస్కృతిని చాటే సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు దాన్ని అన్ని భాషల ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లి..వాళ్లకు తెలిసేలా చేయాలి.
అది మన బాధ్యతగా భావించాలి. బెంగళూరులో భూత్‌కోలా ఉంటుందని కాంతార అనే సినిమా ద్వారా తెలిసింది. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగినా నాకు జమ్మి గానీ, బతుకమ్మ గానీ తెలియదు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు అవన్నీ తెలుసుకున్నా.
నేను ఎప్పుడూ ట్రెండ్ గురించి ఆలోచించలేదు. ఇది మాస్ సినిమా కాబట్టి ఇంకా ఇలాంటి మూవీస్ చేయి అన్నా అంటున్నారు. కానీ నేను నానినే.
నా తరహా చిత్రాలను వదులుకోను. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆరేళ్ల పాపకు తండ్రి పాత్రలో నటించే సినిమాను ఎంచుకున్నా. ఈ మాస్ ఇమేజ్‌ను వెంటనే దులిపేసుకోవాలని ఉంది. అన్ని తరహా చిత్రాల్లో నటించాలని ఉంది. లేకుంటే నటుడిగా ఒకవైపే వెళ్లిపోతాను.
నేను ఇప్పటిదాకా ఉత్తరాది ప్రేక్షకులకు తెలియదు. కానీ సినిమా చూసిన వాళ్లు బాగుందంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. వసూళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
ఈ సినిమా రిలీజ్ ముందు మీకు మాస్ సినిమా బాగుంటుందా? అనే సందేహాలు వెలిబుచ్చేవారు. కానీ నా కెరీర్‌లో ‘నేను లోకల్’, ‘ఎంసీఏ’ వంటి మాస్ సినిమాల్లో ఇప్పటికే నటించాను.