Anand Deverakonda
Anand Deverakonda | ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను.
కానీ మొదటిసారి ఓ వైడ్ రేంజ్ ఆడియన్స్‌ను పలకరించే సినిమాతో వస్తున్నాం.
ప్రీమియర్ షోలు కూడా హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. బేబీ (Baby) అనేది నా బెస్ట్ జర్నీ.
నా కెరీర్‌లో బేబీ (Baby) ఎప్పటికీ నిలిచిపోతుంది’ అన్నారు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda).
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా రూపొందుతున్న చిత్రం ‘బేబీ’ (Baby).
సాయి రాజేష్ (Sai Rajesh Neelam) దర్శకుడు. ఎస్‌కేఎన్ (SKN) నిర్మాత . ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా చిత్ర హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రేమ అనంతమైనది.
ప్రేమ మీద ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.
కానీ ఈ సినిమాలో ప్రేమను సాయి రాజేష్ (Sai Rajesh Neelam) తన కోణంలోంచి చూపించారు.
ఆయన రైటింగ్ కొత్తగా వుంటుంది. ఆయన కోణంలో ప్రేమను చూపించిన, చెప్పిన విధానం చాలా కొత్తగా వుంటుంది.
తొలిప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి. ఈ చిత్రంలో తొలిప్రేమను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు.
ప్రేమలో సంతోషం, బాధ అన్నీ వుంటాయి. ఆ ఎమోషన్స్‌ను ఈ చిత్రంలో బాగా చూపించాం.
ఈ చిత్రాన్ని థియేటర్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. యూత్‌తో పాటు మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది.
నా కెరీర్‌లో ఇప్పటి వరకు థియేట్రికల్ హిట్ లేదు. ఈ చిత్రం ఆ లోటును తీరుస్తుందనే నమ్మకం వుంది.
ట్రైలర్ చూసి అన్నయ్య విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు అనిపించింది.