Apps:
Follow us on:

Allari Naresh | ఉగ్రం మూవీ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్..

1/14Allari Naresh | అల్లరి నరేశ్‌ (Allari Naresh)‌ కాంపౌండ్‌ నుంచి వస్తున్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). నాంది (Naandhi) ఫేం విజయ్‌ కనకమేడల (vijaykanaka Medala) డైరెక్ట్ చేస్తున్నాడు.
2/14ఇప్పటికే విడుదలైన ఉగ్రం (Ugram) టీజర్‌, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఉగ్రం (Ugram) మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
3/14ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ (Allari Naresh)‌ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
4/14ఉగ్రం (Ugram) సినిమా గురించి అల్లరి నరేశ్ (Allari Naresh)‌ మాటల్లోనే.. కామెడీ రోల్‌ చేయడం ఈజీ.. ఉగ్రం (Ugram)లో పోలీసాఫీసర్‌ పాత్ర ఎంత ఛాలెంజింగ్‌గా అనిపించింది? నిజం చెప్పాలంటే.. కామెడీ పాత్రలు చేయడం చాలా కష్టం.
5/14కామెడీ బాగా చేసే వాళ్లు ఏ పాత్రనైనా చేసేస్తారు. ఇటీవలే రంగమార్తాండలో బ్రహ్మానందం (Brahmanandam)గారు చేసిన పాత్ర చాలా డిఫరెంట్‌.
6/14అంతేకాదు సూరి కూడా వెట్రిమారన్ కెక్కించిన విడుతలై పార్టు-1లో సీరియస్‌ రోల్‌ చేసి.. మార్పుకు స్వాగతం పలికాడు.
7/14రెండు కారణాలున్నాయి.. కామెడీ కంటెంట్‌ని క్రియేట్‌ చేసే వారి సంఖ్య తగ్గింది. కొందరు కామెడీ కథలతో వస్తున్నారు.
8/14కానీ అవి సినిమా చేసేంతగా సరిపోవు. ఓటీటీ పెరిగిన తర్వాత నిర్మాతలు డార్క్‌ జోనర్ కంటెంట్‌ను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
9/14విజయ్‌ చాలా కూల్‌గా ఉంటాడు. టెన్షన్ పడడు. తనపై తనకు చాలా నమ్మకం ఉంటుంది. తన క్రాఫ్ట్‌ గురించి విజయ్‌కు బాగా తెలుసు. ప్రతీ ఒక్కరి పనిని గౌరవించి.. అందరికీ క్రెడిట్‌ ఇవ్వడం విజయ్‌లో నచ్చే బెస్ట్‌ థింగ్‌.
10/14సినిమా అదృశ్యమైన జనాల చుట్టూ తిరుగుతుంది. మేం ట్రైలర్‌ ద్వారా అడ్వాన్స్‌గా స్టోరీ చెప్పాం. ఎవరైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయిస్తారు. కానీ పోలీసాఫీసర్‌గా సమస్య వస్తే..? ఆ సమస్యను వృత్తిపరంగా ఎదుర్కొంటాడా..? వ్యక్తిగతంగా ఎదుర్కొంటాడా..? అనే దాని చుట్టూ కథ ఉంటుంది. ప్రేక్షకులను క్యారెక్టర్లు కట్టిపడేస్తాయి.
11/14ఉగ్రం (Ugram)లో ఆరు మేజర్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ఉండబోతున్నాయి. యాక్షన్‌ పార్టు పూర్తి చేసేందుకు చాలా సమయం పట్టింది.. కొంత ఆలస్యం కూడా అయింది. అయితే నిర్లక్ష్యం వల్ల మాత్రం కాలేదు. ఫస్ట్‌ షెడ్యూల్‌ తర్వాత నిర్మాతలు అవుట్‌పుట్‌ చూసి.. చాలా సంతోషించారు.
12/14ఒకవేళ నేను ఈవీవీ బ్యానర్‌లో సినిమా చేయాలనుకుంటే.. అది ఖచ్చితంగా కామెడీ సినిమానే అయి ఉండాలి. ఈవీవీ సినిమా అంటే.. బెండు అప్పారావు (Bendu Apparao), కితకితలు (Kithakithalu), అత్తిలి సత్తిబాబు (Athili Sattibabu), తొట్టిగ్యాంగ్ (Thotti Gang)లాంటి కామెడీ సినిమాలు.
13/14నేనలాంటి కథల కోసం ఎదురుచూస్తున్నా. చాలా కథలు విన్నా. కానీ ఆ కథలతో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఇప్పటికే ఫరియా అబ్దుల్లాతో కలిసి చేస్తున్న నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాను. టైటిల్‌ పెట్టాల్సి ఉంది.
14/14కొత్త డైరెక్టర్‌ మల్లి అంకం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేం సుబ్బుతో కూడా చర్చలు జరుపుతున్నా. జెండా అనే టైటిల్‌తో రాసిన కథను కొన్నా. ఈ కథను నేను నిర్మించాలనుకుంటున్నా. గుంటూరు బ్యాక్‌ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ ఫిల్మ్‌ సెట్‌లో ఉండబోతుంది. డైరెక్టర్‌ గురించి ఆలోచిస్తున్నా.