ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే.. గోడలనే కాన్వాస్‌గా మార్చుకుంటారు. ఆర్టిస్ట్ అవతారమెత్తి.. తమ ట్యాలెంట్నంతా కుమ్మేస్తుంటారు. క్రేయాన్స్‌తో పుస్తకాల్లో రంగులు నింపడం మాని.. గోడలపై పిచ్చి గీతలు గీస్తుంటారు. ఇక వాటిని తొలగించడానికి తల్లులు తలలు పట్టుకుంటుంటారు. అయితే.. కొన్ని చిట్కాలతో ఈ మరకలను ఇట్టే తొలగించవచ్చని నిపుణులు అంటున్నారు.
వంటసో డా : గోడలపై క్రేయాన్ గీతలను తొలగించడంలో వంటసోడా సమర్థంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ వంట సోడా తీసుకొని.. అందులో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను గోడపై గీతలు ఉన్న చోట రాసి.. పాత టూత్ బ్రష్‌తో సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత తడి వస్త్రంతో తుడిస్తే.. గీతలు ఇట్టే మాయమవుతాయి.
హెయిర్ డ్రయర్: గోడలపై పడ్డ క్రేయాన్స్ గీతలను.. హెయిర్ డ్రయర్ సాయంతో ఈజీగా పోగొట్టొచ్చు. ఇందులోంచి వచ్చే వేడిగాలిని క్రేయాన్స్ మరకలపై పడేలా చేయాలి. మరకలు వేడయ్యాక.. సోప్ నీళ్లలో ముంచిన వస్త్రంతో తుడిచేయాలి. గోడలకు ఎలాంటి డ్యామేజ్ కాకుండానే.. మరకలు తొలగిపోతాయి.
టూత్‌పేస్ట్: దంతాలను తెల్లగా మార్చే టూత్‌పేస్ట్.. గోడలనూ తళతళా మెరిపిస్తుంది. ఏ కంపెనీ టూత్‌పేస్ట్ అయినా తీసుకొని.. గోడలపై గీసిన క్రేయాన్ గీతలు, రంగులపై కొద్దికొద్దిగా అప్లయి చేయాలి. ఓ అరగంటపాటు అలాగే ఉంచేసి.. తడి వస్త్రంతో తుడిస్తే మరకలు మాయమైపోతాయి.