భృంగరాజ్ను మూలికల రారాజుగా పిలుస్తారు. ఇదొక ఆయుర్వేద అద్భుతం. జుట్టు పెరుగుదలకు, కుదుళ్ల సత్తువకు ఎంతో తోడ్పడుతుంది. తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి.
జుట్టు పెరుగుదల: భృంగరాజ్ తైలాన్ని క్రమం తప్పకుండా తలకు రాసుకోవడం వల్ల కుదుళ్లు బలపడతాయి. జుట్టు రాలడం ఆగిపోతుంది. ఈ నూనె తలపై మంటను కూడా తగ్గిస్తుంది.
చుండ్రు నివారణ: చాలామందికి ఒత్తయిన జుట్టు ఉంటుంది కానీ, చుండ్రు సమస్య నిత్యం వేధిస్తూ ఉంటుంది. భృంగరాజ్లోని యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రును దూరం చేస్తాయి.
నెరుపు: భృంగరాజ్ నూనెకు జట్టును బూడిదరంగులోకి మార్చే గుణం ఉంది. తెల్ల వెంట్రుకల సమస్యను ఎదుర్కొనే వారికి ఇది చక్కటి ఔషధం.
కాలేయ రక్షణ: కాలేయంలోని వ్యర్థాలను తొలగించడంలో భృంగరాజ్ ఆకులు ఔషధంలా పనిచేస్తాయి. భృంగరాజ్ మూలికలు/రసం కాలేయ కణాల ఉత్పత్తికి సాయపడుతాయి. పాము కాటు చికిత్సలోనూ దీన్ని వాడతారు.
వాపు తగ్గుదల: దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. చర్మం ఎర్రబడటాన్ని నియంత్రిస్తుంది. సోరియాసిస్, డెర్మటైటిస్, మొటిమలు తదితర చర్మ సంబంధ సమస్యల చికిత్సలో భృంగరాజ్ సమర్థంగా పనిచేస్తుంది.
అల్జీమర్స్ చికిత్స: భృంగరాజ్ మూత్రనాళ సమస్యలను నివారిస్తుంది. సుఖనిద్రకు తోడ్పడుతుంది. అల్జీమర్స్ చికిత్సలోనూ ఈ మూలికను వాడతారు. భృంగరాజ్ కొందరిపై దుష్ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంది. కొన్నిసార్లు ఈ మూలిక మూత్ర విసర్జనను పెంచుతుంది. రక్తాన్ని పలుచగా చేస్తుంది. పాలిచ్చే తల్లులు దూరంగా ఉండటం మంచిది.