మీనాక్షి నిండు గర్భిణి. నొప్పులు మొదలయ్యాయి. బిడ్డ ఉమ్మనీరు మింగినట్లు అనుమానం వచ్చింది. భర్తకు ఫోన్ చేసింది. తను వాషింగ్టన్ చేరుకోవడానికి రెండు గంటలైనా పట్టొచ్చు. ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్ చేసింది. అంబులెన్స్‌కూ సమయం పట్టేలా ఉంది. ఆ లోపు ఏం చేయాలి? నొప్పులు తీవ్రం అవుతున్నాయి. వెంటనే, ఆన్లైన్ క్లాసులో తాను రాసుకున్న నోట్స్ తీసింది. ఆ పాఠాలను అనుసరించింది. సాయంత్రానికి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
తల్లీ, బిడ్డ్డా క్షేమం! ప్రముఖ చైల్డ్‌బర్త్ ఎడ్యుకేటర్ అనుపమ కుమార్ విజయానంద్ ఇచ్చిన నోట్స్‌ను ఫాలో అవుతూ కొన్ని భంగిమలను ప్రాక్టీస్ చేసింది మీనాక్షి. అనుపమ తమిళనాడులోని తిరుపూర్‌లో ఉంటుంది. సుఖప్రసవానికి సంబంధించి గర్భిణులకు ఆన్లైన్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. మీనాక్షిలాంటి వేలాదిమంది ఎన్నారైలు ఆమె సలహాలు పాటిస్తూ సుఖప్రసవం పొందిన సంఘటనలు అనేకం. ఆమె గతంలో కంప్యూటర్ ఇంజినీర్. ఆసక్తికొద్దీ సుఖప్రసవానికి సహకరించే యోగ సూత్రాలను, చిట్కాలను డిజైన్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను ఎనిమిది లక్షలమంది ఫాలో అవుతున్నారు.