దసరా అంటే.. ఉత్తరాదివాళ్లకు గార్బా, దాండియాలే. ఉత్తర భారతాన్ని ఓ ఊపు ఊపే ఈ నృత్యాలు దక్షిణాదికి కూడా విస్తరించాయి. ఓ మోస్తరు పట్టణాలకూ పాకి పోయాయి. అందులోనూ గార్బా చక్కని వ్యాయామం కూడా. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు.

గార్బా ఫిట్నెస్కు అనువైన నృత్యం.
గుండె రోగాలను దరిచేరనీయదని నిపుణులు అంటున్నారు. కొన్ని భంగిమల్లో శరీరం మొత్తం కదులుతుంది. దీనివల్ల వ్యాయామం చేసినంత ఫలితం ఉంటుంది.
గార్బాతో శ్వాసకోశ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
నృత్యం చేస్తున్నప్పుడు మనం తాదాత్మ్య స్థితిలో ఉంటాం. దీంతో ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని, ఉద్రిక్తతను తగ్గిస్తాయి.
గార్బా హై-ఇంటెన్సిటీ ఏరోబిక్స్తో సమానమైంది. గంటకు 500 నుంచి 600 కేలరీలు కరిగిపోతాయి.
కుటుంబ సమేతంగా గార్బా ఆడటం ఓ మధురానుభూతి. బంధాలు బలపడతాయి కూడా.