మెడనిండా ఎన్ని నగలున్నా మగువల అలంకరణకు నిండుదనం తెచ్చేది మాత్రం హారమే.కంఠం నుంచి ఉదరం వరకు విస్తరించిన నిండైన హారం ముందు ఏ ఆభరణమైనా చిన్నబోవాల్సిందే. చంద్రహారం, సూర్యహారం, కాసుల హారం.. ఇలా రకరకాల పేర్లతో ప్రాచీన కాలంనుంచీ మగువల మనసులు దోచేస్తున్నదీ ఆభరణం. ఈ హారాల తయారీలోఎన్నో విధానాలు. టెంపుల్, నక్షి , కుందన్, పోల్కి, యాంటిక్, డైమండ్.. ఇలా ఒక్కో విధానంలో ఒక్కో ఫినిషింగ్, ఓ ప్రత్యేకత!
బొట్టు హారం
బొట్టు ఆకృతిలో గుండ్రంగా ఉండటం వల్ల ‘బొట్టు హారం’ అని పిలుస్తారు. రకరకాల కుందన్ కాంబినేషన్లతో ఈ నగ అందు
బాటులో ఉంది. శుభకార్యాలతోపాటు పార్టీవేర్‌గానూ ధరించవచ్చు.
పిందెల హారం
మామిడి పిందెల డిజైన్‌తో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. క్లాసిక్ లుక్‌తో ఆకట్టుకోవడం దీని
ప్రత్యేకత. తరాలుమారినా ట్రెండింగ్‌లోనే ఉంది.
గుండ్ల హారం
సాదా బంగారపు గుండ్లతో తయారు చేస్తారు. చాలా ప్రాచీనమైన డిజైన్. ఒకప్పుడు కంఠం చుట్టూ మాత్రమే అలంకరించుకొనేవారు. ఇప్పుడు, ఉదరభాగాన పరుచుకునేలా రూపొందిస్తున్నారు.
నెమలి హారం
నెమలి నేపథ్యంలో విభిన్న రకాల స్టోన్స్ , వివిధ కాంబినేషన్లలో లభిస్తుంది. చేయి తిరిగిన
స్వర్ణకారుల అపూర్వ సృష్టి ఇది.
మువ్వల హారం
ఈ హారంలో చిన్నచిన్న మువ్వలు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి. బంగారపు మువ్వలే కాకుండా, చిన్నచిన్న ముత్యాలనూ మువ్వలుగా మలుస్తారు.
వజ్రాల హారం
వజ్రాభరణాలు ఎప్పుడూ ప్రత్యేకమే. వజ్రాల హారాలు ధరించి నప్పుడు కాంబినేషన్లో వాడే ఇతర నగలనూ జాగ్రత్తగా ఎంచుకోవాలి. దుస్తుల ఎంపికా ప్రధానమే.
పచ్చలహారం
పచ్చ, కెంపు హారాలు కండ్లకు నిండుగా కనిపిస్తాయి. పట్టు వస్ర్తాలపై చక్కగా నప్పుతాయి. ఈ కలర్ కాంబి నేషన్ ఒక డిఫరెంట్ లుక్‌ను ఇస్తుంది.
ముత్యాల హారం
మూడు నాలుగు వరుసల ముత్యాలతో చేస్తారు. అందం, ఆకర్షణ పోటీపడతాయి. కావలసిన పెండెంట్‌ను జత చేసుకోవచ్చు.
కాసుల హారం
పూర్వీకుల వారసత్వ ఖజానా నుంచి అందిన కానుక ఇది. కాలానికి అనుగుణంగా నిత్య నూతనంగా అలరిస్తున్నది. మధ్య వయసు మహిళలు చాలా ఇష్టపడతారు.