ఇంటిని ఎంత ముచ్చటగా అలంకరించుకున్నా.. బెడ్రూమ్ సర్దడం మాత్రం తలనొప్పి వ్యవహారమే. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడైతే.. మరింత ఇబ్బంది. అలా అని ఆ చెత్త మధ్య బతికేయలేరు. అలాంటివాళ్ల కోసం కొన్ని చిట్కాలు..
పడకగదిని సర్దుకోవాలని అనుకున్నప్పుడు మొదటగా పడకను సర్దాలి. వార్డ్‌రోబ్‌లోని దుస్తులను బెడ్‌పై వేసుకొని.. పాతవన్నీ పక్కనపెట్టొచ్చు.
ఆలూమగలకే పరిమితమైన కండోమ్స్ లాంటివి నలుగురికీ కనిపించకుండా రహస్య ప్రదేశాలలో దాచుకోవడం మేలు. పిల్లల కంటబడితే ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ల సందేహాలు తీర్చాల్సి ఉంటుంది.
గడియారాలు, చెవి పోగులు, పుస్తకాలు, గాజులు, ఆభరణాలు ఎక్కడపడితే అక్కడ పడేయకుండా..
ఓ ట్రేలో జాగ్రత్తపరచండి.
బెడ్రూమ్ శుభ్రం అయ్యాక.. మిగిలిపోయిన వస్తువులను సెకండ్‌హ్యాండ్ దుకాణాల్లో అమ్మండి. లేదంటే ఏ స్వచ్ఛంద సంస్థకైనా ఇవ్వండి. అంతేకానీ, మళ్లీ అక్కడే ఇరికించే ప్రయత్నం వద్దు. దీనివల్ల గది ఇరుకైపోతుంది. అసౌకర్యంగా మారుతుంది.
చాలామంది కర్టెన్లను పెద్దగా పట్టించుకోరు. ఏండ్ల తరబడి ఉతికే ప్రయత్నమూ చేయరు. దీనివల్ల వాటిపై హానికర క్రిములు చేరిపోయే ప్రమాదం ఉంది. ఇంకా, ఆ గదిలో ఒకటిరెండు ఇండోర్ ప్లాంట్స్, గోడకు ఓ పెయింటింగ్ ఉండేలా చూడండి.