పోషకాల.. బ్రెజిల్ నట్స్!
బ్రెజిల్ నట్స్.. బ్రెజిల్ నట్ వృక్షానికి కాస్తాయి. ఈ చెట్లు బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో పెరుగుతాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. కొబ్బరికాయను పోలినట్టుండే కాయలో 12 నుంచి 20 గింజలు ఉంటాయి. ఉన్నవి ఉన్నట్టు తినేయొచ్చు.
బ్రెజిల్ నట్స్.. బ్రెజిల్ నట్ వృక్షానికి కాస్తాయి. ఈ చెట్లు బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో పెరుగుతాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. కొబ్బరికాయను పోలినట్టుండే కాయలో 12 నుంచి 20 గింజలు ఉంటాయి. ఉన్నవి ఉన్నట్టు తినేయొచ్చు. పొట్టుతీసి కూడా ఆరగించవచ్చు. రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు. బ్రెజిల్ నట్స్ చెడు
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిలోని ఇలాజిక్ యాసిడ్ నాడీ కండరాలు క్షీణించకుండా కాపాడుతుంది. దీంతో మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బ్రెజిల్ నట్స్‌లో సెలీనియం ఉంటుంది. ఇది శరీరంలో థైరాయిడ్ స్థాయులను పెంచుతుంది. దీంతో మన మూడ్ మంచిగా ఉంటుంది. శరీరంలో థైరాయిడ్ స్థాయులు తగినంతగా లేకపోతే ఆందోళన, చిరాకు పెరుగుతాయి. సెలీనియం రోగ నిరోధక వ్యవస్థ పనితీరును, పునరుత్పాదక శక్తిని మెరుగుపరుస్తుంది. సెలీనియం ఎక్కువైతే మాత్రం గోళ్లు పెళుసుబారుతాయి. జుట్టు రాలిపోతుంది. బ్రెజిల్ నట్స్ తింటే క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. వీటిలోని సెలీనియం కారణంగా పొట్ట, అన్నవాహిక, రొమ్ము, ప్రొస్టేట్, ఊపిరితిత్తులు, పేగుల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గిపోతుంది. వీటికి గుండె వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంది. సెలీనియం సమృద్ధిగా ఉండటం వల్ల ధమనుల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా హృద్రోగాల గండం తగ్గుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

