క్యాన్సర్‌ను ఓడిద్దాం
గత మూడు దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు వచ్చాయి. సాంకేతికత అభివృద్ధి చెందింది. ఫలితంగా, క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అలా అని, నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు.
గత మూడు దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు వచ్చాయి. సాంకేతికత అభివృద్ధి చెందింది. ఫలితంగా, క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నది. అలా అని, నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదు. ఆ వ్యాధిని మళ్లీ మళ్లీ ఓడించాల్సిందే. నేడు క్యాన్సర్ వ్యతిరేక దినం.
శరీరంలో కణ విభజన అసాధారణంగా జరిగిపోతూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించే వ్యాధి.. క్యాన్సర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. అలా అని, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందన్న భరోసా లేదు. అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక మగత, నొప్పి, శరీర వ్యవస్థ పనితీరు మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం.. తదితర దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. ఈ దశలో గుండెజబ్బులు, కిడ్నీ రోగాలు, మధుమేహం లాంటి రుగ్మతలూ ఇబ్బంది పెడతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తవచ్చు. ఈ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో అధిగమించడం సాధ్యమే.
జీవనశైలి మార్పులు వ్యాయామం, సమతుల ఆహారం, యోగా, ధ్యానం, కౌన్సెలింగ్ తదితర మార్గాల్లో ఒత్తిడిని తట్టుకోవచ్చు. ఆరోగ్యకర జీవనశైలిని కొనసాగించవచ్చు. అవగాహన రోగికే కాదు.. అతని కుటుంబానికి, సన్నిహితులకు కూడా ఆ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ముప్పు గురించి అవగాహన అవసరం. సపోర్ట్ గ్రూప్స్ అప్పటికే క్యాన్సర్‌ను గెలిచినవారి మధ్యలో కాలం గడపడం వల్ల భావోద్వేగపరమైన అండ లభిస్తుంది. అనుభవాలను పంచుకోవచ్చు. డాక్టర్‌తో సంప్రదింపులు ఒడ్డున పడిన తర్వాత కూడా.. క్యాన్సర్ నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. శరీరంలో కొత్త మార్పులు, రోగ ప్రభావాల గురించి నిపుణులతో చర్చించాలి. సర్దుబాట్లు క్యాన్సర్ చికిత్స మనసుపైనా ప్రభావం చూపి ఉంటుంది. దానికితోడు సమాజం నుంచి ఎదురయ్యే వివక్ష కూడా బాధపెడుతుంది. ఖరీదైన వైద్యం కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవాలి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

