ఆ మహిళల ఆలోచన అన్నదాతల కష్టాన్ని తీరుస్తోంది.. వాళ్లకు లాభాన్ని తెస్తోంది..
రైతుకు ఆధునిక పనిముట్లు అవసరం. దీనివల్ల సాగుబడి ఖర్చు తగ్గుతుంది. కూలీల కొరతనూ అధిగమించవచ్చు. కానీ, ఆ బక్క జీవికి అంత డబ్బుపెట్టి సొంతంగా కొనే స్తోమత ఉండదు. ధైర్యం చేసి కొన్నా.. వాయిదాలు కట్టలేక ఇబ్బంది పడతాడు. ఉన్న కాస్తంత భూమి కోసం అంత పెట్టుబడి పెట్టడమూ లాభదాయకం కాదు. ఈ సమస్యకు మహిళా సంఘాలు పరిష్కారం చూపుతున్నాయి. ఆధునిక యంత్ర పరికరాలను అద్దెకు అందిస్తున్నాయి. దీనివల్ల రైతుకు ఉపయోగం, మహిళలకు లాభం. ఒక తీవ్ర సమస్యకు తిరుగులేని పరిష్కారం!

ఓ తీవ్ర సమస్యకు తమదైన జవాబు కనిపెట్టారు.. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం విశ్వనాథపల్లిలోని ‘ సిరివెన్నెల స్వయం సహాయక సంఘం ’ సభ్యులు. ‘అన్నదాత కస్టమర్ హైరింగ్ సెంటర్’ ద్వారా వ్యవసాయ యంత్రాలను చవకగా అద్దెకు ఇస్తున్నారు. దీనిద్వారా కొంత ఆదాయమూ పొందుతున్నారు. పరోక్షంగా రైతులకూ సాయపడుతున్నారు. వారికి రెండేండ్ల క్రితం వచ్చిన ఆలోచన ఇది. ఐడియా తళుక్కు మనగానే సెర్ఫ్ అధికారుల సహకారంతో కార్యాచరణ
ప్రణాళిక రూపొందించుకున్నారు. వివిధ సంస్థల ద్వారా అందిన రూ.25 లక్షల నిధులతో యంత్రాలు కొన్నారు. కల్టివేటర్, చక్రపు నాగలి, ఎరువులు చల్లే యంత్రం, గడ్డిమోపుల యంత్రం, మక్కజొన్న విత్తనాలు వలిచే యంత్రం, పవర్ టిల్లర్, వరికోత యంత్రం.. ఇలా మొత్తం పదిహేను రకాల పరికరాలు ఈ మహిళా సంఘం దగ్గర ఉన్నాయి.

భలే మంచి బేరం
గతంలో ఏ చిన్న యంత్రం కావాలన్నా రైతులు పొరుగూరికో, పక్కూరికో పరుగులు పెట్టేవారు. అంతదూరం వెళ్లినా పరికరాలు లభిస్తాయన్న భరోసా లేదు. కిరాయీ ఎక్కువే. ఇప్పుడు ఆ బాధలన్నీ తీరిపోయాయి. ఉన్న ఊరిలోనే తక్కువ అద్దెలకు ఆధునిక వ్యవసాయ పరికరాలు, యంత్రాలు లభించడం పట్ల రైతులూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకైతే మరింత చవకగా అద్దెకు లభిస్తాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ‘ఆజాద్ కా మహోత్సవ్’లో భాగంగా తన అధికారిక వెబ్ సైట్లో 75 స్ఫూర్తిదాయక కథనాలను ప్రచురించింది. అందులో ‘సిరివెన్నెల’కూ చోటు లభించింది. తమ శాఖ జర్నల్స్‌లోనూ ఈ విజయ గాథను ముద్రించింది. ఇప్పటివరకు సిరివెన్నెల కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా వివిధ రకాల యంత్రాలను 180 రోజులపాటు అద్దెకు ఇచ్చారు. ఖర్చులుపోనూ, మూడు లక్షలా డబ్భు అయిదువేల రూపాయల లాభం వచ్చింది. ‘ఈ రాబడికి అదనంగా.. పంట పెట్టుబడి ఖర్చు కూడా తగ్గింది’ అని సంతోషంగా చెబుతారు మహిళా రైతు రాజమ్మ.

సంఘాలను ప్రోత్సహిస్తున్నాం…
సింగరేణి మండలం విశ్వనాథపల్లి కేంద్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయం. కస్టమర్ హైరింగ్ సెంటర్లు విజయవంతంగా పని చేస్తున్నాయి. మహిళా సమాఖ్యలకు మంచి ఆదాయం లభిస్తున్నది. మిగతా మండలాల్లోనూ ఇదే తరహా కేంద్రాల ఏర్పాటుకు సంఘాలను ప్రోత్సహిస్తున్నాం. అవసరమైన మార్గదర్శనం చేస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనీ కోరుతున్నాం.
– ఎం.విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం
✍ మాటేటి వేణుగోపాల్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
darpan ahluwalia | పోలీస్ అకాడమీలో పరేడ్ కమాండర్‌గా నడిపించబోతున్న ఈమె గురించి తెలుసా
ekta kapoor | మరో కొత్త బిజినెస్‌లోకి బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్
PV sindhu |పద్మభూషణ్ అందుకున్నప్పుడు పీవీ సింధు కట్టుకున్న చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభరణాలు.. వీటిని మించిన ఫ్యాషన్ లేనే లేదు
ఫ్యాషన్ రంగంలో ఇప్పుడామె ఓ ట్రెండ్ సెట్టర్.. తొమ్మిదేళ్ల క్రితం ధైర్యం చేయకపోయుంటే మాత్రం..
jai bhim | చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ ఎవరు? ఆమెకు ఎలా అవకాశం వచ్చింది?
హద్దులు చెరిపి.. సరిహద్దుల వరకూ!
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి




