మొబైల్ ఫొటోగ్రఫీలో ‘వివో’ది అగ్రస్థానం. తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ.. ఇటీవలే ‘ఎక్స్300’ సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది వివో సంస్థ. ఈ మోడల్స్‌లోని అతిపెద్ద ఫీచర్.. ఇందులోని అద్భుతమైన కెమెరా వ్యవస్థ. 200 మెగాపిక్సెల్ సెన్సర్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అదే సిరీస్‌లో భాగంగా.. ఎక్స్300 అల్ట్రా మోడల్‌కూ రూపకల్పన చేస్తున్నది. అదిరిపోయే ఫీచర్లతో రూపొందుతున్న ఈ ఫ్లాగ్షిప్ మోడల్.. మొబైల్ ఫొటోగ్రఫీలో సరికొత్త సంచలనంగా మారనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘వివో ఎక్స్300 అల్ట్రా’లోని ఫీచర్లపై అప్పుడే సామాజిక మాధ్యమాల్లో చర్చ ప్రారంభించారు. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్.. వెనుక భాగంలో రెండు 200 ఎంపీ కెమెరా సెన్సర్లతో రాబోతున్నది. ఇంతపెద్ద డ్యుయల్ కెమెరాలు కలిగిన ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కాబోతున్నది. 200 ఎంపీ మెయిన్ కెమెరా.. సోనీ సెన్సర్ సాయంతో నడవనున్నది.
ఇది 35 ఎంఎంకి సమానమైన ఫోకల్ లెంగ్త్‌ను అందిస్తుంది. ఇక 200 ఎంపీ సెకండరీ కెమెరా.. పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్‌గా ఉపయోగపడుతుంది. 85ఎంఎంకి సమానమైన ఫోకల్ లెంగ్త్‌ను అందిస్తుంది. ఈ రెండు కెమెరాలతోపాటు 50 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీల కోసం ముందు భాగంలో ఆటోఫోకస్‌తో కూడిన 50 ఎంపీ కెమెరాను అమర్చారు. ఈ హైఎండ్ కెమెరాలకు తగ్గట్టుగా.. మరింత వేగవంతమైన పనితీరు కోసం ఇందులో అగ్రశ్రేణి ప్రాసెసర్‌ను వాడారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్-5 చిప్సెట్తో ఈ స్మార్ట్‌ఫోన్ రాకెట్ స్పీడ్‌తో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 12 జీబీ ర్యామ్‌తోపాటు మరో 12 జీబీ వర్చువల్ ర్యామ్‌ను అందివ్వబోతున్నారు.
256 జీబీ ఇన్‌బిల్ట్ మెమొరీ అందివ్వనున్నారు. 6.8-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 2కే రిజల్యూషన్‌తోపాటు 120హెర్ట్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే.. ఆండ్రాయిడ్-16 ఆధారంగా పనిచేసే ఆరిజిన్ ఓఎస్-6తో రన్ అవుతుంది. ఇక దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్. 120వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తోపాటు 50వాట్స్ వైర్లెస్ ఫ్లాష్ఛార్జ్ను సపోర్ట్ చేస్తుంది. ఎక్స్ 300 అల్ట్రా మోడల్ 2026లో చైనాలో విడుదల కానున్నది. ఆ తర్వాతే ఇతర దేశాలలో అందుబాటులోకి రానున్నది. అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్న ఈ ఆధునిక స్మార్ట్‌ఫోన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.