పసుపు మేలు దక్కాలంటే?
పసుపులో ఉండే కుర్కిమిన్ బయోయాక్టివ్గా పనిచేస్తూ కణాల వృద్ధికి, కణజీవక్రియకు మేలు చేస్తుంది. శరీరంలో జరిగే జీవక్రియలు సాఫీగా సాగేందుకు పసుపు ఉపయోగపడుతుంది.
పసుపులో ఉండే కుర్కిమిన్ బయోయాక్టివ్గా పనిచేస్తూ కణాల వృద్ధికి, కణజీవక్రియకు మేలు చేస్తుంది. శరీరంలో జరిగే జీవక్రియలు సాఫీగా సాగేందుకు పసుపు ఉపయోగపడుతుంది. అందుకే రుచి కలిగించకపోయినా ఈ మేలుని గుర్తించి పసుపుని ఏనాడో ఆహారంలో చేర్చుకున్నారు మనవాళ్లు. నేటి పరిశోధనలూ ఈ విషయాలను ధ్రువపరిచాయి. అయితే.. పసుపుతో కలిగే మేలుని పొందాలనే తాపత్రయంలో పరిమాణాన్ని పెంచుతున్నారే కానీ, ఆశించిన ప్రయోజనం దక్కుతున్నదా? లేదా అని మాత్రం ఆలోచించట్లేదు! పసుపులో నీళ్లు కలిపి ముద్దలుగా మింగడం గృహ వైద్యంలో ఎక్కువగా ఆచరిస్తారు. ఇలా తినడం వల్ల పసుపులో ఉండే కుర్కిమిన్ శరీరంలోకి పోతుంది.
కానీ, ఒంట బట్టదట. కుర్కిమిన్ పూర్తిగా శరీరంలోకి చేరాలంటే పసుపుని నీళ్లలో కలిపి కాకుండా నెయ్యి, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్లో కలుపుకొని తీసుకుంటే మేలు. పసుపులోని కుర్కిమిన్ నూనెల్లో కరిగిపోతుంది. కాబట్టి ఇలా జరుగుతుందట. నూనెలు తక్కువగా తినాల్సిన అవసరం ఉన్నవాళ్లు చిటికెడు మిరియాల పొడిలో కాస్త పసుపు పొడి కలుపుకొని తినాలని ప్రత్యామ్నాయ మార్గం చూపుతున్నారు. మిరియాలలో ఉండే పైపరీన్ పదార్థం వల్ల కుర్కిమిన్ని శరీరం ఎక్కువగా సంగ్రహించేలా చేస్తుంది. ఇవేవీ అందుబాటులో లేకపోతే పప్పు, సబ్జా గింజలు, వంటల్లో కొంత వేసుకుని ఉడికిస్తే పసుపులోని కుర్కిమిన్ శరీరానికి అందుతుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- body's metabolic
- turmeric
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

