ముఖంపై నల్లమచ్చలు పోగొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. స్క్రబింగ్, పీలింగ్ అంటూ మార్కెట్లోకి వచ్చిన ప్రతి ప్రొడక్ట్‌తో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఈ నల్లమచ్చలను సహజంగా, కేవలం మెత్తటి తువాలుతో దూరం చేసుకోవచ్చు. సాధారణంగా ముక్కు, గదవ, నుదురు భాగాల్లో ఈ నల్లమచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. చర్మపు రంధ్రాల్లో నూనె (సీబమ్), మృత కణాలు, దుమ్ము ధూళి చేరడం వల్ల అవి మూసుకుపోతాయి. దాంతో అక్కడ నల్ల మచ్చలు ఏర్పడతాయి.