నచ్చినవారు మెచ్చేలా, వలపుల వరమిచ్చేలా సింగారించుకుంటారు ప్రేమికులు. తమ ఇద్దరి భావాలు, ఆలోచనలే కాదు.. అలంకరణ కూడా ఒకేలా ఉందంటూ ప్రపంచానికి పరోక్షంగా సందేశం పంపుతారు. అలాంటి ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ జంటల కోసం ఫ్యాబ్రిక్ డిజైనర్లు చాలా కసరత్తే చేస్తున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా కొన్ని కపుల్ డిజైన్స్.. ఫ్లోరల్ పింక్‌తో..
హాఫ్ వైట్ బేస్‌పై గ్రీన్ అండ్ రెడ్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన డిజైనర్ కాంబో ఇది. కాంట్రా
స్టింగ్‌గా బేబీ పింక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్‌ను జతచేసి ఫ్రాక్ అండ్ షర్ట్ డిజైన్ చేశారు. అమ్మాయి కోసం టాప్ అండ్ బాటమ్ పింక్ ఫ్లోరల్ కాంబినేషన్ ఇచ్చారు. బోట్ నెక్ కింద ఇచ్చిన హార్ట్ షేప్ కట్ సింబాలిక్‌గా ఉంది. స్పెషల్ లుక్ కోసం జతచేసిన ఎల్బో హ్యాండ్స్, ఫ్లోరల్ ప్లిట్స్, క్రాస్ కోట్.. ట్రెండీ లుక్ తెచ్చాయి. అబ్బాయికి పింక్ అండ్ ఫ్లోరల్తో షర్ట్ ఇచ్చి కాంట్రాస్టింగ్‌గా గ్రే జీన్స్ జతచేశారు.
కాంబోస్టైల్ ..
మెహందీ గ్రీన్ బేస్‌పై రెడ్, గ్రీన్, వైట్ కలర్ లైన్స్ ఉన్న ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన కాంబో ఇది. అమ్మాయి కోసం ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్నారు. యోక్ అండ్ బాటమ్ పార్ట్ ఒకే ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. హై రౌండ్ నెక్ ఇచ్చి చుట్టూ ప్రిన్సెస్ లైన్లో, గ్రీన్ నెట్‌తో ప్రిల్స్ జతచేశారు. ఫుల్ నెట్టెడ్ హ్యాండ్స్ ట్రెండీ లుక్ ఇచ్చాయి. అదే ఫ్యాబ్రిక్‌తో బాటమ్ పార్ట్‌లో ప్లిట్స్ హైలైట్ అయ్యాయి. అబ్బాయికి సేమ్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్‌తో హాఫ్ హ్యాండ్స్ షర్ట్ ఇచ్చి.. కాంట్రాస్టింగ్‌గా టోన్డ్ బ్లూ జీన్స్ జతచేశారు.
రితీషా రెడ్డి
ఇషా డిజైనర్ హౌస్ follow us on: instagram.com/riteshareddy, 70136 39335