కావలసిన పదార్థాలు
ఓరియో బిస్కెట్స్: 20, డార్క్ చాక్లెట్ సిరప్: అర కప్పు, పాలు: రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ విధానం
ఓరియో బిస్కెట్స్‌ను ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో ఓరియో పొడి, పాలు వేసి బాగా కలిపి చిన్నచిన్న లడ్డూల్లా గుండ్రంగా చేసి ఓ పది నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లబడిన లడ్డూల్ని తీసి చాక్లెట్ సిరప్‌లో ముంచి మరో పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచితే చల్లచల్లని ఓరియో లడ్డూలు సిద్ధం.