బడిని బతికించారు..!

విద్యార్థులు కరువై, ఇక మూసేద్దామని అనుకున్న పాఠశాలకు సొంత ఖర్చుతో ప్రాణంపోశారు ఓ ఉపాధ్యాయురాలు. పిల్లలే లేని చోట 20 మంది విద్యార్థులను చేర్పించి.. గూడెం బడిని గుడిగా మార్చారు. పుస్తకాలతో పనిలేకుండా పాఠశాల గోడలే పాఠాలు బోధించేలా తీర్చిదిద్దారు ఉపాధ్యాయురాలు వసుంధర.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర పరిధిలోని గుర్రంపేట సమీపంలో ఉంటుంది.. రాంనాయక్ తండా. ఇక్కడ 100 గిరిజన కుటుంబాలున్నాయి. ఓ పాఠశాల కూడా ఉంది. కానీ, విద్యార్థులు లేక దాన్ని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. బడిని మూసేస్తే పిల్లల వికాసానికీ తాళాలు పడుతాయి. ఆ విద్యాలయాన్ని ఎలాఅయినా బతికించాలనుకున్నారు ఉపాధ్యాయురాలు వసుంధర. సొంత ఖర్చుతో రంగులు వేయించారు. పాఠ్యాంశాలను గోడలపై చిత్తరువులుగా గీయించారు. తండా సర్పంచ్ సహకారంతో ప్రైవేట్ బడికి వెళ్తున్న పిల్లలను ఒప్పించి రప్పించగలిగారు. విద్యార్థులను తల్లిలా ఆదరించారు. అంతేకాదు, ఆంగ్లంలోనూ బోధన ప్రారంభించారు. ప్రస్తుతం, ఈ బడిలో 20 మంది పిల్లలు చదువుతున్నారు. బడిని చూసినవారంతా ‘మా పిల్లలను ఇక్కడికే పంపిస్తాం’ అంటున్నారు. ‘నా శక్తి మేరకు పాఠశాలను అభివృద్ధి చేశాను. డిజిటల్ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నా. అధికారులు, దాతలు సహకరిస్తే మరిన్ని కార్యక్రమాలు చేపడతాను’ అంటున్నారు వసుంధర.
… తిరుపతి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Teacher
- vasundhara
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

