‘సినిమావాళ్లకేం అదృష్టవంతులు! వద్దన్నా డబ్బే’ అంటుంటారు జనం. కానీ ఆ ఆలోచన సరైంది కాదనీ, తామూ అందరిలా కష్టపడాల్సిందేననీ అంటున్నది మిల్కీ బ్యూటీ తమన్నా. అందం, ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు తపన పడుతూనే ఉంటామని చెబుతున్నది. ఒకప్పుడు, గందరగోళంగా ఉన్న తన డైట్‌ను ఎలా మార్చుకున్నదీ వివరిస్తూ.. సెలబ్రిటీ లైఫ్‌ైస్టెల్ కోచ్ ల్యూక్‌తో కలిసి ‘బ్యాక్ టు ది రూట్స్’ పేరుతో ఏకంగా ఓ పుస్తకమే రాసింది. ‘హోలిస్టిక్ లైఫ్ కోచ్ డ్యూక్‌ను కలిసే వరకూ నా డైట్ వేరుగా ఉండేది. తన పరిచయంతో నా ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. మృదువైన చర్మం కోసం, ఒత్తయిన జుట్టు కోసం, అందమైన ఆకృతి కోసం నేను సంప్రదాయ ఆరోగ్య సూత్రాలను ఎంచుకొన్నాను. మొదట్లో నాకు డైట్ సోడా అంటే ప్రాణం. ఇప్పుడు దాని జోలికే వెళ్లను. కృత్రిమ చక్కెరపైనా మమకారం పోయింది’ అంటున్నది తమన్నా. అంతేనా.. వ్యాయామం, యోగా తమన్నా జీవనశైలిలో భాగమయ్యాయి. గంటల తరబడి షూటింగ్లో పాల్గొంటున్నా సరే, మధ్యలో తీరిక చేసుకుని యోగాసనాలు వేస్తుందట. ఇలాంటి ఎన్నో సౌందర్య రహస్యాలను, జీవనశైలి మార్పులను తన తాజా పుస్తకంలో ప్రస్తావించింది మిల్కీ బ్యూటీ.