నటనలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్న తాప్సీ నిర్మాత అవతారం ఎత్తింది. రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. అచ్చొచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకొని ‘బ్లర్’ సినిమాను నిర్మించింది. అందులో అంధురాలిగా నటించి మెప్పించింది. ఇటీవల జీ5 ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతున్నది. ఈ సందర్భంగా తాప్సీ అంతరంగం..