Patiala Necklace | ఈ హారం వెనుక ఉన్న కథ తెలిస్తే షాకవ్వాల్సిందే!!
Story of Patiala Necklace | ఫొటోలో కనిపిస్తున్న హారం బావుంది కదూ! దీని వెనుక పెద్ద కథ ఉంది. పంజాబ్‌లోని పటియాలా ప్రాంతాన్ని పాలించిన రాజా భూపేందర్ సింగ్‌కు ఇష్టమైన ఆభరణం ఇది. ప్రపంచంలోనే ఏడో అతి పెద్ద వజ్రాన్ని ఇందులో పొదిగారు. ఇప్పటి దాకా దొరికిన పసుపు పచ్చ వజ్రాలలో ఇదే అతి పెద్దది. రాజ కుటుంబీకులు తరతరాలుగా ఈ వజ్రాన్ని ధరించేలా.. ఒక ప్రత్యేకమైన నగలో దీన్ని అందంగా పొదగాలని సంకల్పించారు.
ప్రఖ్యాత ఆభరణాల తయారీ సంస్థ ‘కార్టియర్’కు ఈ పనిని అప్పగించారు. ఐదు వరుసల్లో తీర్చిదిద్దిన ఈ హారంలో డి బీర్స్ వజ్రం ప్రధానంగా కనిపించేలా మొత్తం రెండువేలా తొమ్మిది వందల ముప్పై వజ్రాలను వాడారు. వాటితో పాటు అరుదైన కెంపులనూ జోడించారు. ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే దీని విలువ దాదాపు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు. 1948లో రాజావారి ఖజానా నుంచి ఈ నగ మాయమైంది. మళ్లీ ఆ తర్వాత 1982 ప్రాంతంలో సోత్బే సంస్థ ద్వారా వేలానికి వచ్చిందా వజ్రం, అదీ హారం లేకుండానే. మరికొంత కాలానికి లండన్‌లోని ఓ పురాతన వస్తువుల దుకాణంలో వజ్రాల హారంలోని కొంత భాగం దర్శనమిచ్చింది. పటియాలా రాజ కుటుంబానికి తయారు చేసిచ్చిన కార్టియర్ సంస్థవారే ఈ హారాన్ని కొనుగోలు చేసి, వజ్రాలు పోయిన స్థానంలో.. వాటిని పోలిన రంగు రాళ్లను పెట్టి లండన్‌లో ప్రదర్శనకు పెట్టారు. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ఓ ఫ్యాషన్‌షోలో కార్టియర్ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఎమ్మా చాంబర్లీన్ పటియాలా హారంలోని చోకర్ తరహా భాగాన్ని ధరించడంతో ఈ ఖరీదైన ఆభరణం మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
Read More :
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది
Lily Dale | ఇచట దెయ్యాలతో మనసు విప్పి మాట్లాడొచ్చు
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

