HomeZindagiStink Smart Tips For A Fresh Smelling Kitchen Dustbin Details
చెత్త కంపు కొట్టొద్దంటే
చెత్తబుట్టను నిర్వహించడం కత్తిమీద సామే! ఇంట్లో ఉంచితే.. దుర్వాసన వ్యాపిస్తుంది. బయట పెడితే.. వీధి కుక్కలతో ఇబ్బంది. అయితే, కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఈ సమస్య ఇట్టే దూరమవుతుంది.
చెత్తబుట్టను నిర్వహించడం కత్తిమీద సామే! ఇంట్లో ఉంచితే.. దుర్వాసన వ్యాపిస్తుంది. బయట పెడితే.. వీధి కుక్కలతో ఇబ్బంది. అయితే, కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఈ సమస్య ఇట్టే దూరమవుతుంది.
తడి చెత్త ఎక్కువగా ఉంటే.. చెత్తబుట్ట నుంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి, మిగిలిపోయిన ఆహారం, కూరగాయల వ్యర్థాలు, పండ్ల తొక్కలు లాంటివి చెత్తబుట్టలో ఎక్కువసేపు ఉంచకూడదు. వాటిని వీలైనంత త్వరగా చెత్తబండి వాళ్లకు చేరవేయాలి.
సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయ, నారింజ తొక్కలు సహజమైన సువాసనలను వెదజల్లుతాయి. కాబట్టి, చెత్తబుట్టలో నిమ్మకాయ, నారింజ తొక్కలను వేసినా.. దుర్వాసన మాయమవుతుంది.
చెత్తబుట్టను ఖాళీ చేసిన తర్వాత.. లోపలి భాగాన్ని క్రమం తప్పకుండా కడుగుతుండాలి. వారానికి ఒకసారైనా సబ్బు నీరు, డిస్ఇన్ఫెక్టెంట్తో శుభ్రం చేయాలి. తడి లేకుండా ఎండలో బాగా ఆరబెడితే.. వాసన దూరం అవుతుంది.