HomeZindagiSome Examples To Know That Love Bond Is Stron
బంధం బలంగా ఉంటే
ప్రేమ, పెళ్లి.. బంధం ఏదైనా బలంగా ఉండాల్సిందే. ఒకరిని ఒకరు వదిలి ఉండలేకపోవడం, గాఢంగా ప్రేమించుకోవడం, ఒకరి ధ్యాసలో మరొకరు ఉండటం, ప్రపంచం మొత్తాన్ని మరిచిపోయి మాట్లాడుకోవడం.. ఇవన్నీ ప్రేమ బంధం బలంగా ఉందని తెలుసుకునేందుకు కొన్ని ఉదాహరణలు.

చిన్నచిన్న గొడవలు, వాదనలు భార్యాభర్తల మధ్య సర్వసాధారణం. అయితే ఒకరిపై ఒకరికి నిండైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి వాదనల్ని పొడిగించాలని అనుకోరు. ఒకరిది తప్పు అని తేల్చే వరకు పట్టుదలకు పోరు. ఆ చర్చను అర్థవంతంగా ముగించేందుకు ప్రయత్నిస్తారు.
కొన్ని అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి బాధపడవచ్చు. అలాగని మీ ఉద్దేశాన్ని మీలోనే దాచుకుంటే మీ పార్ట్నర్కు ద్రోహం చేసినట్టు అవుతుంది. మీకు నచ్చని విషయాన్ని చెప్పినప్పుడు మీ భాగస్వామి తొలుత హర్ట్ అయినా.. కాసేపటికి అర్థం చేసుకుంటాడు. సంతోష పెట్టడానికి అబద్ధం చెప్పడం కన్నా.. నిజాయతీగా ఉన్నందుకు సంతోషపడతారు.
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, సినిమాలు చూడటం.. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో అంశం అంటే ఇష్టం ఉంటుంది. ఒకరి అభిరుచులు మరొకరికి తప్పకుండా నచ్చాలని లేదు. పార్ట్నర్కు నచ్చిన అంశాన్ని చేయనివ్వడం కూడా బంధానికి ఇచ్చే విలువల్లో ఒకటి.