HomeZindagiSome Blood Tests Will Require You To Fast Beforehand
రక్త పరీక్షలకు వెళ్తున్నారా?
కొన్ని రుగ్మతల నిర్ధారణకు రక్త పరీక్ష తప్పనిసరి.
అసలే, సీజనల్ వ్యాధుల కాలం. పరీక్షలకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. లేకపోతే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది.
కొన్ని రక్త పరీక్షలకు ఆరు నుంచి పన్నెండు గంటల ముందు వరకూ ఏమీ తినకపోవడం మంచిది.
రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్ శాతాన్ని తెలుసుకోవడానికి చేసే పరీక్షలకు అయితే ఉపవాసం తప్పనిసరి.
తేడావస్తే ఫలితాలు తారుమారు కావచ్చు. ఈ విషయాన్ని వైద్యుడితో మాట్లాడి నిర్ధారించుకోండి.
రక్త పరీక్షకు 24 గంటల ముందు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఏ కొంత పుచ్చుకున్నా ఫలితాలు మారిపోవచ్చు.
కొన్ని వ్యాధులు అసలు వెల్లడికాకపోనూ వచ్చు.
ఏదైనా దీర్ఘకాలిక వ్యాధికి మందులు వాడుతుంటే, ఆ విషయాన్ని నిపుణుడికి తెలపాలి. వైద్యుల సూచన మేరకు రెండుమూడు రోజుల ముందే మందులు ఆపేసి, ఆ తర్వాత పరీక్షలకు వెళ్లడం ఉత్తమం.
రక్త పరీక్షలకు 24 గంటల ముందు వ్యాయామం వద్దు. కఠినమైన కసరత్తు రక్తంలో ఎంజైమ్‌ల స్థాయిని ప్రభావితం చేయగలదు. దీంతో ఫలితాల్లో కచ్చితత్వం ఉండదు.
గర్భిణులు అనేక మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. హార్మోన్ల పనితీరులోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి, పరీక్ష ఫలితాలలో ప్రామాణికత కోసం వివిధ సమయాల్లో రక్త పరీక్షలు చేయించుకోవడం మేలు. అంకెల్లో అసాధారణమైన తేడా కనిపిస్తే.. ఎక్కడో సమస్య ఉన్నట్టే.